Jayam serial : పెళ్ళి మండపం నుండి పారిపోయిన రుద్ర.. శకుంతల ఏం చేస్తుంది!
on Nov 17, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -115 లో......రుద్రని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు. గంగ పోటీకి వెళ్ళడం లేదని రుద్ర డిస్సపాయింట్ అవుతాడు. గంగకి ఫోన్ చేసి మ్యాచ్ కి వెళ్తున్నావా.. నీకు కొన్ని ట్రిక్స్ చెప్తానని అంటాడు. సారీ సర్ నేను చాలా ట్రై చేసాను. నా వల్ల కావట్లేదని గంగ ఏడుస్తుంది. దాంతో రుద్రకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పడే ప్రీతీ వాళ్ళు రుద్ర దగ్గరికి వస్తారు. నేను ఇప్పుడు గంగ ని తీసుకొని పోటీకి వెళ్లాలని చెప్తాడు.
ఇప్పుడు అందరి ముందు పరువు పోతుందని ప్రీతీ అంటుంది. అక్కడ ఒకమ్మాయి లైఫ్ అని రుద్ర అంటాడు సరే అన్నయ్య మేం మ్యానేజ్ చేస్తాం.. వెళ్ళు నీ ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళమని ప్రీతీ అంటుంది. దాంతో రుద్ర తన ఫోన్ అక్కడే పెట్టి వెళ్తాడు. మరొకవైపు రుద్రని తీసుకొని రా అని ప్రమీలని శకుంతల పంపిస్తుంది. ప్రమీలకి అక్కడున్నా ప్రీతీ అసలు విషయం చెప్పి మ్యానేజ్ చెయ్యమని అంటుంది. సరే అని శకుంతల దగ్గరికి ప్రమీల వెళ్లి బావ గారికి డ్రెస్ ఏదో ప్రాబ్లమ్ ఉందట అని చెప్తుంది. దాంతో రుద్రకి శకుంతల ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ప్రీతీ లిఫ్ట్ చేస్తుంది. అక్కడున్న వంశీ, స్నేహ ముగ్గురు కలిసి మ్యానేజ్ చేస్తారు. ఆ తర్వాత ప్రమీల టెన్షన్ పడుతుంది. గంగ దగ్గరికి రుద్ర వెళ్ళాడు కదా నాకు తెలుసని పెద్దసారు అంటాడు.
అదంతా దూరం నుండి శకుంతల చూసి వస్తుంది. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. ఏం లేదు భోజనలు వేస్ట్ అవ్వకుండా చూడు అందరు తిని వెళ్ళాలని చెప్తున్నానని పెద్దసారు చెప్తాడు. మరొకవైపు గంగని పెళ్లి చేసుకోవడానికి మణి ఉత్సాహంగా ఉంటాడు. తరువాయి భాగంలో గంగ మెడలో రుద్ర తాళి కడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



