2023 ఫిబ్రవరిలో రాకింగ్ రాకేష్ , జోర్దార్ సుజాత పెళ్లి
on Sep 1, 2022

బుల్లితెర వచ్చాక కామెడీ షోస్ చాలా వచ్చాయి. అందులో ఇటీవల చూస్తే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోస్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఈ షోస్ ద్వారా ఎంతోమంది రియల్ లైఫ్ లో జంటలు అయ్యారు. కొంత మంది మాత్రం రీల్ జోడీస్ గా మాత్రమే ఉండిపోయారు. అలాంటి జోడీస్ లో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఉన్నారు. వీళ్ళ ప్రేమ జబర్దస్త్ స్టేజి మీదనే పుట్టింది. అలాగే ఇక్కడున్నవాళ్లందరి చేతుల మీదుగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నట్టు గెటప్ శీనుతో చెప్పించాడు రాకేష్. సుజాత శీను వాళ్ళ తరపున అమ్మాయి కాబట్టి ఆయన చెప్తే బాగుంటుందని పెళ్లి ఫిక్స్ అనే విషయాన్ని మన ఊరి దేవుడు ఈవెంట్ స్టేజి మీద చెప్పించాడు. అలాగే తన తమ్ముడి పెళ్లి కూడా ఈ జబర్దస్త్ స్టేజి మీద చేసిన విషయం తెలిసినదే.
ఇక ఇప్పుడు వాళ్లకు పాప పుట్టేసరికి ఆ పాపకు కూడా ఈ స్టేజి మీదనే పేరు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. నక్షత్ర అనే పేరు ఫిక్స్ చేసి కుష్బూ, ఇంద్రజ, నాగినీడు ముగ్గురూ కలిసి పాప చెవిలో పేరును అనౌన్స్ చేశారు. సుధీర్, రష్మీ , ఇమ్ము, వర్ష జోడీల్లా రాకేష్వీ, సుజాత వాళ్ళ జోడీ కూడా అనుకున్నారంతా మొదట్లో. ఐతే వీళ్ళ ప్రేమ చాలా రియల్ అంటూ ఏ షో చేసినా అక్కడ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఈ జంట పెళ్ళికి సిద్ధమైపోయారు. సుజాత ఇటీవల రాకేష్ ఇంటికి వరలక్ష్మి వ్రతం కూడా చేసి వచ్చిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



