పుష్ప 3 స్టోరీ ఇలా ఉండబోతుందా ?
on Jan 25, 2025
జబర్దస్త్ సరిపోదా శనివారం ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్ స్కిట్ అదిరిపోయింది. పుష్ప 1 , 2 సిరీస్ చూసాం కానీ ఇక్కడ పుష్ప 3 ఎలా ఉండబోతోందో చూపించారు. పుష్ప కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం శ్రీవల్లికి ఒక బాబు పుట్టాడు. వాడు పుట్టినదగ్గర నుంచి స్కూల్ కి వెళ్లకుండా సిండికేట్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. ఇక జూనియర్ పుష్పగా నాటీ నరేష్ అతని తల్లిగా ఫైమా చేసింది. జూనియర్ పుష్పని పిచ్చకొట్టుడు కొడుతోంది. ఇక ఇందులో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా సత్యశ్రీ చేస్తుంది. ఇక ఆమె పుష్ప డీటైల్స్ తీసుకోవడానికి వస్తుంది.
వివరాలన్నీ అడుగుతూ ఉంటుంది. "మీకు ఆస్తులు ఉన్నాయా" అని అడుగుతుంది సత్యశ్రీ. దానికి బులెట్ భాస్కర్ రెచ్చిపోయి "బోడుప్పల్ లో రెండు కోట్ల విలువైన బిల్డింగ్ ఉంది..అది కూడా బఫర్ జోన్ లో ఉంది.. రేపో మాపో వాళ్లొచ్చి కూల్చేస్తారు" అన్నాడు. వెంటనే నాటీ నరేష్ భయపడిపోయి " ఒరేయ్ నువ్వు లేనిపోనివి చెప్పకురా...వాళ్ళు నిజంగానే అనుకుని వచ్చినా వస్తార్రా..." అన్నాడు. దీంతో నాటీ నరేష్ నిజంగానే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకున్నాడా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను కూల్చేసిన విషయం తెలిసిందే. ఇక ఫైమా ఐతే స్కూల్ లో వెళ్లమంటూ తన్నడం తిట్టడం ఈ స్కిట్ లో హైలైట్ అయ్యింది. నిజంగా ఈ మూవీ డైరెక్టర్ ఇది చూస్తే పుష్ప 3 ని చూసి నవ్వుకోకుండా ఉండడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
