సుదీర్, రష్మీలపై నరేష్ కామెంట్స్..పళ్ళు రాలగొట్టిన రాంప్రసాద్
on Jan 23, 2026
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సమ్మక్క సారక్క కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇక ఇందులో రష్మీ పెళ్లి విషయం బాగా హైలైట్ అయ్యింది. నాటీ నరేష్ సోదెమ్మ గెటప్ లో వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. "సోది సెబుతానమ్మా సోది" అంటూ వచ్చేసరికి రష్మీ "సూదమ్మ సూదమ్మా" అని పిలిచింది. "సూదమ్మా దారమమ్మా కాదె సోదెమ్మ" అంటూ కరెక్ట్ చేసాడు నరేష్. తర్వాత తన అరచేతిని చూపించి "నా పెళ్లెప్పుడవుతది" అని అడిగింది. "నీకు కాబోయే వాడు మహరాజులా ఉంటాడు. రాత్రయితే ఎవరికీ కనపడడు. జేబులో నుంచి పావురాలను తీస్తాడు. రాత్రయితే ఆ పావురాలను మంచింగ్ కి వాడుకుంటూ ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవడో ఉన్నాడనిపిస్తుంది భవిష్యత్తులో" అని నరేష్ రష్మీ అరచేతిని చూసి జాతకం చెప్పాడు. దానికి రష్మీ తెగ సిగ్గుపడుతూ నవ్వేసింది. తర్వాత రష్మీ సీరియస్ గా "కొంతమంది చాల ఎక్స్ట్రాలు చేస్తున్నారు అందుకే నేను వాళ్ళ పళ్ళు రాలకొడదామనుకుంటున్నా" అంటూ రాంప్రసాద్ వైపు చూస్తూ చెప్పింది.
తర్వాత రాంప్రసాద్, నటీ నరేష్ చిత్రపటాలని ఏర్పాటు చేసి అందులో వాళ్ళ నోట్లో పళ్ళను రాళ్లతో కొట్టేలా ఒక ఫన్నీ గేమ్ ఆడింది, ఆడించింది. తర్వాత రష్మీ, ఇంద్రజ పళ్ళను రాంప్రసాద్ రాలగొట్టాడు. తర్వాత "జయహో భారత్..జై జవాన్ " పేరుతో ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అందులో సింధూర్ ఆపరేషన్ లో ఒక పార్టిసిపేట్ చేసిన ఒక జవాన్ కూడా ఈ స్టేజి మీదకు వచ్చాడు. అదిరే అభి టీమ్ అంతా కలిసి ఒక టాస్క్ చేశారు. ఇలా ఈ వారం ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయబోతోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



