మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్ కమెడియన్ మూర్తి మృతి
on Sep 27, 2022

జబర్దస్త్ కమెడియన్ మూర్తి కాసేపటి క్రితం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ మీడియాకి తెలిపారు. జబర్దస్త్ కమెడీయన్ గా మిమిక్రీ మూర్తి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.. ఆయన మూడేళ్ళ నుంచి పాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు . తన మిమిక్రీతో ఎవ్వరినైనా ఇమిటేట్ చేసే మూర్తి.. 2018 వరకు బుల్లితెరపై అలరించారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండిపోయారు.
ఇక ఈ మూడేళ్ళలో ఆయన ట్రీట్మెంట్ కోసం ఎన్నో లక్షలు ఖర్చుపెట్టారు కానీ ఫలితం దక్కలేదు. ఎంతో మంది దాతలు కూడా ముందుకొచ్చి ఆయనకు సాయం చేశారు. ఎప్పుడూ తన చుట్టూ ఉండేవారిని నవ్వుతూ నవ్వించే మూర్తి మరణంతో తన ఫాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. జబర్దస్త్ అనే కాదు ఆయన ఎన్నో వేదికల పైన తన ప్రదర్శనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మూర్తి. వెండితెర మీద కావొచ్చు, బుల్లి తెర కావొచ్చు ఎందరో కమెడియన్స్ తమ ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. కానీ వారి జీవితంలో తీరని కష్టాలు ఎన్నో ఉంటాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



