Jayam serial: శకుంతల పుట్టినరోజు వేడుకల్లో గంగకి అవమానం.. ఇషిక ప్లాన్ సక్సెస్!
on Feb 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-196 లో.. దీప్తిని తీసుకొని రుద్ర అకాడమీకి వస్తాడు. తన ఫ్రెండ్ తో కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. నా భార్య లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా .. ఈ సారి కూడా దీప్తికి అలా జరిగే అవకాశం ఉంది.. మీరు జాగ్రత్తగా ఉండండి.. అని రుద్ర చెప్తాడు. అతను సరే అంటాడు. దీప్తి.. నువ్వు ఏదైనా తినే ముందు, తాగే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకో, కేర్ ఫుల్ అని చెప్పగానే సరే అంటుంది. ఆ తర్వాత రుద్ర వెళ్ళిపోతాడు. ఇక దూరం నుండి పారు మరియు వాళ్ళ అన్నయ్య చూస్తారు. చూసావా అన్నయ్య రుద్ర నాకు కాంపిటీషన్ ని తీసుకొచ్చాడని వాళ్ళ అన్నయ్యతో పారు అంటుంది. నేను చూసుకుంటానమ్మా.. దీప్తిని కాంపిటీషన్ కి రానివ్వను.. అసలు క్వాలిఫై అవ్వనివ్వనని పారుతో వాళ్ళ అన్నయ్య అంటాడు.
గంగ కిచెన్ లో కేక్ ప్రిపేర్ చేస్తుంటుంది. అప్పుడే తన దగ్గరికి రుద్ర వస్తాడు. అమ్మవారు బర్త్ డే కేక్ ని చేయమని చెప్పారు.. చేస్తున్నానని గంగ అంటుంది. నీకు చేయడం రాకపోతే రాదని చెప్పొచ్చు కదా ఇలా అన్ని పనుల్ని మీద వేసుకొని చేయడం ఎందుకని రుద్ర అంటాడు. నాకు వచ్చు సర్ కానీ మీరు చేస్తుంటే బాగుందని గంగ అంటుంది. ఆ తర్వాత కేక్ ని బేక్ చేయడం కోసం ఓవెన్ లో పెట్టమని గంగకి చెప్తాడు రుద్ర. ఆ తర్వాత తను ఓవెన్ లో పెడుతుంది. రుద్ర బయటకు వస్తుంటే అప్పుడే సూర్య, వంశీ వస్తారు. రుద్రని ఆటపట్టిస్తుంటే వాళ్ళని బెదిరిస్తాడు రుద్ర. ఆ తర్వాత ఇంటికి గెస్ట్ లు వస్తారు.
మరోవైపు సూర్య, వంశీ అంతా కలిసి ఇంట్లో బెలూన్ లు అవీ అన్నీ డెకరేట్ చేస్తుంటారు. పెద్దసారు ఇక అందరితో మాట్లాడుతుంటాడు. మీ బర్త్ డే చాలా గ్రాంఢ్ గా ప్లాన్ చేశారు కదా ఏర్పాట్లు బాగున్నాయని గెస్ట్ లు అంటారు. ఇవన్నీ మా కోడలు గంగ చేసింది. తనే సొంతంగా కేక్ ప్రిపేర్ చేస్తుందని పెద్దసారు చెప్తాడు. దాంతో ఓహో తన కోడలిని తనలాగే తీర్చిదిద్దుతుందన్నమాట.. సూపర్ శకుంతల గారు అంటూ గెస్ట్ లు అంటారు. దాంతో అవునన్నట్టుగా శకుంతల తలూపుతుంది. ఇక ఆ మాటలు విని ఇషిక, పారుల దగ్గరికి వీరు వస్తాడు. విన్నారు కదా.. గంగ అనిగిమనిగి పనులు చేస్తుందనుకున్నారు కానీ శకుంతలని తనవైపు తిప్పుకుంటుందని అర్థమవుతుందా అని వీరు అనగానే అర్ధమవుతుందని పారు అంటుంది. అలా జరగనివ్వనని ఇషిక అంటుంది. ఏం చేస్తావని పారు అనగానే ఇషిక కిచెన్ లోకి వెళ్ళి బేక్ అయిన కేక్ ని తీసుకెళ్ళి మళ్ళీ ఓవెన్ లో పెడుతుంది. దాన్ని తీసి మళ్ళీ ఎక్కడుందో అక్కడ పెట్టేసి వస్తుంది ఇషిక. ఇక గెస్ట్ లు అందరు కలిసి గంగని పొగుడుతుంటారు. మీ కోడలు చాలా పద్ధతిగా చీర కట్టుకుంది. ఈ రోజుల్లో ఎవరు అలా ఉంటారని గెస్ట్ లు అనగానే.. వీళ్ళ పొగడ్తలు తట్టుకోలేకపోతున్నానని పారు అంటుంది. ఇంకా కొన్నినిమిషాల్లో వాళ్ళే తిట్లు తిడతారని ఇషిక అంటుంది. ఇక గంగని పెద్దసారు కేక్ తీసుకురమ్మంటాడు. తను తీసుకొస్తుంది. ఓపెన్ చేయగానే అది మాడిపోయి ఉంటుంది. దాంతో గెస్ట్ లు అంతా కలిసి మీ కోడలు ఇలా చేసిందేంటని అంటారు. ఇక శకుంతల అందరి ముందు గంగని తిడుతుంది. వీరు, పారు , ఇషిక హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి రుద్ర ఏం చేస్తాడు. గంగకి శకుంతల భారి నుండి కాపాడతాడా లేదా ఇషిక ప్లాన్ గెలుస్తుందా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



