మ్యూజిక్ డైరెక్టర్ కోటిని కోతి అంటూ కామెడీ చేసిన ఈర్య
on Dec 4, 2025

సరిగమప లిటిల్ చాంప్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే లిటిల్ ఈర్య వచ్చి కోటి మీద డైలాగ్స్ వర్షం కురిపించింది. వచ్చి రాని తెలుగుతో, సరిగా నోరు తిరగక కోటిని పట్టుకుని కోతి అనేసింది. దాంతో ఆయన కూడా షాకయ్యారు. "అక్కడ ఎవరున్నారో తెలుసా కోటి గారు..తెలుసా అసలు కోటి గారి గురించి నీకు " అని అడిగాడు సుధీర్. "కొంతమందికి ఇష్టం గ్రీన్ టీ, అందరికీ ఇష్టం కోతి" అంది.
"కోటి గారికి ఏమన్నా తీసుకొచ్చావా మరి" అని అడిగాడు సుధీర్. అతని చేతికి ఒక పుస్తకం ఇచ్చింది. ఏంటిది రామ కోటా అని అడిగాడు సుధీర్. "నీలాంటోళ్ళు తలతిక్కగా మాట్లాడినప్పుడు కోతి నమస్కారాలు" అని చెప్పింది. దాంతో కోటి తన పేరును అన్ని సార్లు కోతి అంటూ ఉండేసరికి తలపట్టుకున్నారు. "నా తప్పేముంది కోతి అన్నయ్య" అని అడిగింది ఈర్య. "నువ్వు ఫస్ట్ నా పేరును కరెక్ట్ గా పలకడం కొంచెం నేర్చుకో" అనేసరికి క్యూట్ గా అపాలజీ చెప్తూ "ఐ ఆమ్ వెరీ సారీ" అనే పాట పాడింది. "దయచేసి ఈర్య సారీ చెప్తే వెంటనే యాక్సెప్ట్ చేసేయండి. మనం యాక్సెప్ట్ చేయకపోతే అది మళ్ళీ పాట పాడి ఇబ్బంది పెట్టొద్దు ఈర్యాని" అంటూ జడ్జ్ అనిల్ రావిపూడి చెప్పాడు. "ఇంకా పాడతా రోజూ" అంటూ రెట్టించి మరీ రిప్లై ఇచ్చింది ఈర్య. "నిజాన్ని కోటిగారిని నువ్వు పిలిచినందుకన్నా కూడా ఈ పాటను పాడినందుకు ఎక్కువగా ఫీలైనట్టున్నారు" అంటూ సుధీర్ అనేసరికి కోటి నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



