ఇంద్రజ స్లిమ్ గా ఉండడానికి కారణం తెలుసా..?
on Feb 2, 2025
ఇంద్రజ ఇప్పటికీ స్లిమ్ గా ఉండడానికి కారణమేంటో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈఎఫెక్స్ యంత్రాన్ని తీసుకుని దాని మీద చెమటలు పట్టేంత వరకు వ్యాయామం చేస్తోంది. లేడీస్ కి ఫిట్ నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ యంత్రం మీద బాడీ మొత్తం కదులుతుంది. కాబట్టి కొంచెం డబ్బులు సేవ్ చేసుకుని ఈ యంత్రం తీసుకోండి అని చెప్పింది. బ్లైండ్ గా ఈ యంత్రం తీసుకుని 20 నిమిషాల నుంచి అరగంట వర్కౌట్ చేయండి. అంతే మీకు ఆరోగ్యం వస్తుంది, మీ కుటుంబాన్ని చూసుకోగలుగుతారు అంటూ సజెస్ట్ చేసింది.
ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ తన్మయ్ , రష్మీ గౌతమ్ ఇద్దరూ కూడా సూపర్ అని మెసేజ్ చేశారు. "మీరు ఈ వయసులో కూడా వ్యాయామం చేస్తున్నారు. ఆరోగ్యంపై ఎంత శ్రద్ద ..సూపర్ మేడం గారు ..గుడ్ జాబ్ ...మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజాను, రష్మీని పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరిదీ సేమ్ ఏజ్ అన్నట్టుగా ఉంటారు. అందంలో రష్మీతో పోటీ పడుతూ ఉంటుంది ఇంద్రజ. ఏదైనా వ్యాయామం ఆరోగ్యానికి మంచిది అని అంటోంది ఇంద్రజ. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా తన హవా చూపించింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
