రిగ్రెట్ తో ఉండలేను బిగ్ బాస్!
on Nov 2, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లో అందరు తననే కావాలని టార్గెట్ చేసారని బాధపడుతూ ఇనయా వాష్ రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుంది. అందులో ఏడుస్తూ ఉండగా, హౌస్ మేట్స్ అందరు తన కోసం వెతికి, చివరికి వాష్ రూంలో ఉందని తెలుసుకొని బయటకు రమ్మని ఎంత పిలిచినా రాలేదు. దీంతో హౌస్ మేట్స్ లో అందరికి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. కాగా ఇనయా మాట్లాడుతూ, "నన్ను కన్ఫెషన్ రూం కి పిలవండి బిగ్ బాస్" అని అనగా, సరే అని బిగ్ బాస్ పిలిచాడు.
ఆ తర్వాత ఇనయా కన్ఫెషన్ రూంకి వెళ్ళింది. అక్కడ ఏడుస్తూ చెప్పింది. " బిగ్ బాస్ నేను ఈ హౌస్ లో ఉండలేను. సూర్య నా వల్లే వెళ్ళిపోయాడు. ఈ రిగ్రెట్ తో ఉండలేను" అని చెప్పగా, "ఈ ఇంట్లోకి రావడం వరకే మీ నిర్ణయం ఉంటుంది. ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అనేది ఆటలో ఒక భాగం. బయటకు వెళ్ళాలి అనేది ప్రేక్షకులు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీకు బాగా దగ్గర అయిన వాళ్ళు ఇలా నిన్ను ఏడుస్తూ చూడాలనుకుంటున్నారా..మీ కన్నీళ్ళు తూడ్చుకొని బయటకు వెళ్ళండి " అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఇనయా కళ్ళు తూడ్చుకొని బయటకు వచ్చేసింది.
ఇనయా, ఫైమాతో మాట్లాడుతూ, "ఎక్కువ ఇష్టపడ్డవాళ్ళు అందరు దూరం అవుతారు. నాకు ఎవరు లేరు. నేను బాగా ఇష్టపడే మా నాన్న నాకు దూరం అయ్యాడు. నేను బాగా ఇష్టపడే సూర్య హౌస్ నుండి వెళ్ళిపోయాడు" అని ఏడుస్తూ చెప్పుకుంది. ఇలా నిన్న జరిగిన సీన్ హౌస్ మేట్స్ అందరిని టెన్షన్ కి గురిచేసింది.