అమూల్య పెళ్ళిపనులు మొదలు.. టెన్షన్ లో భాగ్యం, శ్రీవల్లి!
on Jan 25, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -376 లో..... ప్రేమ, ధీరజ్ ఇద్దరు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు. మళ్ళీ ప్రేమ వెనక్కి వచ్చి మీరు సాంపిల్ గా నాది మా హస్బెండ్ ది వెడ్డింగ్ కార్డ్ చేశారు కదా అది ఇవ్వండి అని తీసుకొని వెళ్తుంది. మరొకవైపు ఆనందరావుని విశ్వ కిడ్నాప్ చేస్తాడు. అదే విషయం భాగ్యానికి విశ్వ ఫోన్ చేసి చెప్తాడు. మీరు పెళ్లి ఆపకుంటే మీ హస్బెండ్ ని ఏం చేస్తానో నాకే తెలియదని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో భాగ్యం టెన్షన్ పడుతుంది.
ఆ తర్వాత శ్రీవల్లికి భాగ్యం ఫోన్ చేసి ఆ విశ్వ గాడు మీ నాన్నని కిడ్నాప్ చేశాడు. ఈ పెళ్లి ఆపాలని చెప్పాడని చెప్తుంది. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను అయినా నా మాట ఎవరైనా వింటారా అని శ్రీవల్లి కోప్పడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ప్రేమ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ చూసుకొని మురిసిపోతుంది. ముందు ధీరజ్ ఉన్నట్లు ఉహించుకొని మనం కూడా చిన్నప్పటి నుండి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోని ఉంటే మనకి ఎన్నో మెమోరీస్ ఉండేవని అంటుంది. అప్పుడే ధీరజ్ వచ్చి ముందు కూర్చుంటాడు. ఒరేయ్ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కొట్టావ్ పెళ్లికి ముందే నువ్వు నాపై అధికారం చూపించావ్.. నిన్ను కొట్టాలని ఉంది కానీ నీ బుగ్గ సున్నితంగా ఉంటుందని చెప్పి ధీరజ్ బుగ్గ గిల్లుతుంది ప్రేమ. ఒసేయ్ అని ధీరజ్ అరుస్తాడు. అప్పుడు ఉహలో నుండి బయటకి వస్తుంది ప్రేమ. చేతిలో ఏంటని లాక్కొబోతాడు కానీ ప్రేమ వెడ్డింగ్ కార్డు ధీరజ్ కి ఇవ్వదు.
మరొక వైపు ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. ప్రేమ డల్ గా కూర్చొని ఉంటుంది. అది నర్మద చూసి ధీరజ్ దగ్గరికి వెళ్లి అందరు హ్యాపీగా ఉన్నారు.. ఒక్క ప్రేమ తప్ప.. తను చేసిన తప్పు ఒప్పుకుందిగా క్షమించు తనతో మాములుగా ఉండమని చెప్తుంది. దాంతో ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్లి మాట కలిపి సారీ అని చెప్తాడు. నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావురా అని ప్రేమ అంటుంది. సారీ అంటున్నా కదా అని ధీరజ్ అనగానే కావాలనే ధీరజ్ ని ఆటపట్టిస్తుంది ప్రేమ.ఆ తర్వాత పెళ్లి పనుల్లో భాగంగా పసుపు దంచడం మొదలు పెడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



