ENGLISH | TELUGU  
Home  » TV News

Illu Illalu Pillalu: అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకున్న సాగర్.. ఇంటికి వచ్చిన రామరాజు!

on Feb 8, 2026

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-389 లో... సాగర్ తన మామ శ్రీనివాస్ రావుతో కలిసి ఒక ఏజెంట్ ని కలుస్తారు. అతను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానంటే అతనికి ఇరవై లక్షల డబ్బు  కావాలని చెప్తాడు. దాంతో సాగర్ డబ్బు ఇవ్వడానికి సంకోచిస్తాడు. నేను కేవలం మా మావయ్య కోసం గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకుంటున్నానని సాగర్ అంటాడు. అతనికి డబ్బు ఇస్తాడు. అతను వెంటనే సాగర్ కి అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తాడు. అది చూసి సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.

 

మరొకవైపు రామరాజు డిశ్చార్జ్ అయి వస్తున్నాడని భాగ్యం దిష్టి తియ్యడానికి గుమ్మడికాయ రెడీ చేస్తుంది. రామరాజు ని తీసుకొని అందరు వస్తారు. భాగ్యం దిష్టి తియ్యాలని చెప్పగానే వేదవతి దిష్టి తీస్తుంది. అమూల్య బయటకు వస్తుంది. కావాలనే విశ్వ ఇక్కడ ఏం చేస్తున్నావే అని చెంపపై కొడుతాడు. అదంతా వాళ్ళు చూస్తారు. చందు, ధీరజ్ కోపంగా వెళ్తుంటే వేదవతి ఆపుతుంది. తిరుపతి వెళ్లి నా మేనకోడలిపై చేయి వేశావో నీ సంగతి చెప్తానని వార్నింగ్ ఇస్తాడు. నా భార్య నా ఇష్టం అని తిరుపతి అంటాడు. ఎవరినో కొడితే మనకేంటి అని వేదవతి పిలుస్తుంది. 

 

ఆ తర్వాత ప్రేమకి కొరియర్ వస్తుంది. కొరియర్ ఓపెన్ చేసి చూడగా అందులో పోలీస్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఉంటుంది. అది చూసి ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంట్లో చెప్పడం కరెక్ట్ కాదని ప్రేమ అనుకుంటుంది. ఆ లెటర్ ఏంటి ప్రేమ అని శ్రీవల్లి అడుగుతుంది. నీకెందుకు అని నర్మద ఎంట్రీ ఇస్తుంది. నర్మద కొట్టిన చెంపదెబ్బ గుర్తుచేసుకొని శ్రీవల్లి భయపడుతుంది. 

 

ఆ తర్వాత అందరు హాల్లో కూర్చొని ఉంటారు. సాగర్ ఎక్కడ అని నర్మదని రామరాజు అడుగుతాడు. అప్పుడే సాగర్ తనకి ఇచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్ తో వస్తాడు. రామరాజుని చూసి జేబులో పెట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళావ్ రా మీ నాన్న డిశ్చార్జ్ అవుతుంటే లేవని వేదవతి అంటుంది. కొంచెం వర్క్ ఉందని సాగర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.