Illu Illalu Pillalu: అమూల్య చేసిన పనికి రామరాజుని తిట్టేసి వెళ్ళిన వనజ ఫ్యామిలీ!
on Feb 1, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -383 లో... అమూల్యని విశ్వ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు అమూల్య లేదన్న విషయం తెలిసి ఇంట్లో అందరు కంగారుపడుతారు. అప్పుడే వనజ కుటుంబం వస్తుంది. నా కోడలు రెడీ అయిందా అని అడుగుతుంది. అమ్మ మీరు లోపలికి రండి అని రామరాజు అంటాడు.
అప్పుడే భద్రవతి, సేనాపతి వస్తారు. ఎందుకు రా లోపలికి.. నా కూతురు లేచిపోయిందని చెవిలో చెప్పడానికా అని భద్రవతి అనగానే ఎందుకు అలా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రామరాజు అంటాడు. ఏంటి అన్నయ్య వాళ్ళు చెప్పింది నిజమేనా అని వనజ అడుగుతుంది. భద్రవతితో రామరాజు కుటుంబం గొడవ పడుతుంది.
అప్పుడే విశ్వ వస్తాడు. నీ కూతురు రాత్రంతా నాతో ఉందని చెప్తాడు. కార్ లో నుండి తనని విశ్వ తీసుకొని వస్తాడు. అమూల్యని చూసి ఇంట్లో అందరు షాక్ అవుతారు. రాత్రంతా నాతో గడిపిన నీ చెల్లికి పెళ్లి ఎలా అవుతుంది. అయిన నేను పెళ్లి చేసుకోనని విశ్వ అంటాడు దాంతో ధీరజ్, సాగర్, చందు గొడవపడుతుంటే వద్దు మేం ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అమూల్య తాళి చూపిస్తుంది. అదేంటి మనం పెళ్లి ఎక్కడ చేసుకున్నామని విశ్వ షాక్ అవుతాడు. నన్ను క్షమించండి నాన్న అని అమూల్య అంటుంది. వేదవతి, అమూల్య చెంప చెల్లుమనిపిస్తుంది.
పాతికేళ్ళ క్రితం నువ్వు అదే పని చేసావ్.. ఎందుకు దాన్ని తప్పు పడుతున్నావ్ అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. మీ కుటుంబం గురించి మంచిగా అనుకున్నాను.. ఇలాంటి పెంపకం అని రామరాజుని వనజ ఫ్యామిలీ తిట్టి వెళ్తుంది. విశ్వ, అమూల్య ఇద్దరిని పెద్దావిడ లోపలికి తీసుకొని వెళ్తుంది. రేవతిని హారతి తీసుకొని రమ్మని పెద్దావిడ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



