Illu illalu pillalu: శ్రీవల్లిపై వేదవతి ఫైర్.. ప్రేమని ధీరజ్ క్షమిస్తాడా?
on Jan 4, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -359 లో.. ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి ప్రేమగా శాలువా కప్పినట్లు ఉహించుకుంటుంది.
మరొకవైపు భాగ్యం, ఆనందరావుల దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. మీ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అని కోపంతో వాళ్ళకి చల్లటి నీళ్లు మీద పోసుకోమని పనిష్మెంట్ ఇస్తుంది. దాంతో చలికి వణుకుతూ ఇలా చెయ్యడం కరెక్ట్ కాదని భాగ్యం అంటున్న కొద్దీ ఇద్దరిపై శ్రీవల్లి చల్లటి నీళ్లు పోస్తుంది. ఎలాగూ ఆ విశ్వగాడు వదిలేలా లేడు కాబట్టి ఈ పెళ్లి క్యాన్సల్ చేయించాలని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది.
మరొకవైపు ధీరజ్ కి ప్రేమ సారీ చెప్తుంది. పేపర్ పై సారీ అని రాసి పెడుతుంది. అది చూసినా కూడా ధీరజ్ చూడనట్లు ఉంటాడు. ప్రేమ కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అయిన ధీరజ్ తీసుకోడు.
దాంతో నర్మదకి చెప్పుకొని ప్రేమ బాధపడుతుంది. నువ్వేం బాధపడకు.. ధీరజ్ బాగా హర్ట్ అయినట్లున్నాడని నర్మద అంటుంది. అసలు అమూల్యకి మా అన్నయ్య అంటే ఇష్టం లేదు.. ఎవరో కావాలని ఇదంతా చేశారని ఇద్దరు అనుకుంటారు. అదంతా శ్రీవల్లి విని వాళ్ళని డైవర్ట్ చెయ్యాలని వాళ్ళ మధ్యలోకి వెళ్తుంది. ఏంటి అక్కా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్.. నాకు నీపై డౌట్ వస్తుందని ప్రేమ అంటుంది. దాంతో శ్రీవల్లి ఏదో ఒకటి చేసి టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
ఆ తర్వాత ఇంట్లో అందరిని పిలిచి ఇల్లంతా డల్ గా ఉంది అంత్యాక్షరి ఆడుకుందామని శ్రీవల్లి అంటుంది. నిన్న అంత గొడవ అయింది.. అదే బాధలో ఉంటే ఇప్పుడు వచ్చి ఏంటి ఇది అని శ్రీవల్లిపై వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



