Illu illalu pillalu : కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకున్న ప్రేమ.. తన మెడలో తాళి కట్టింది ఎవరు?
on Jan 9, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -51 లో.....ప్రేమ లేచిపోయిందన్న విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళ మాటలు తట్టుకోలేక సేనాపతి గదిలోకి వెళ్లి గన్ ని తల దగ్గర పెట్టుకుంటాడు. ఆ విషయం తిరుపతి వెళ్లి రామరాజుకి చెప్తాడు. వెళ్లి కాపాడని తిరుపతిని పంపిస్తాడు రామరాజు. తిరుపతితో పాటు అందరు డోర్ ని నెట్టి లోపలికి వెళ్తారు. నేను ఈ అవమానం భరించలేనని సేనాపతి అంటాడు.
ఆ తర్వాత వేదవతి విషయంలో రామరాజుని వదిలిపెట్టి తప్పు చేసాం కానీ ఇప్పుడు ప్రేమ విషయంలో ఈ తప్పు జరగడానికి వీలు లేదు గంటలో తనని తీసుకొని వెళ్ళిన వాడు ఇక్కడ ఉండాలని భద్రవతి అంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి ప్రేమ అమ్మాలనుకుంటున్న అతను ఫోన్ చేసి వచ్చామని చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ బాధపడుతుంటే.. పదా ఇక వెళదాం.. ఇంత దూరం వచ్చాక ఆగడం.. ఎందుకంటూ నగలున్న బ్యాగ్ ని తీసుకొని పదా అని కళ్యాణ్ అంటాడు. ఈ బ్యాగ్ ఏంటి అని ప్రేమ చూడగా.. అందులో నగలు ఉంటాయి. ఇవి ఎందుకు తెచ్చావని అడుగుతుంది. అయిన ఎప్పుడు తీసావ్ అంటుంది నువు ఫ్రెషప్ అవుతున్నాప్పుడని కళ్యాణ్ అనగానే.. అంటే నా కంటే నీకు నగలు ఎక్కువనా అని ప్రేమ అంటుంది. అవును ఎక్కువే నిన్ను ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చింది.. పెళ్లి చేసుకోవడం కోసం కాదు అమ్మడానికి అని కళ్యాణ్ అనగానే.. ప్రేమ షాక్ అవుతుంది. కళ్యాణ్ గురించి ధీరజ్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది.
ఆ తర్వాత ప్రేమని కళ్యాణ్ కాళ్ళు చేతులు కట్టి బంధిస్తాడు. మరొకవైపు భద్రవతి కుటుంబాన్ని పెళ్లి కూతురు లేచిపోయిందంటూ పెళ్లి కొడుకు వాళ్లు అవమానిస్తారు. దాంతో ఎందుకు అలా అంటున్నారు.. వాళ్లే బాధలో ఉన్నారని భద్రవతికి సపోర్ట్ గా రామారాజు మాట్లాడి.. వాళ్ళని పంపిస్తాడు. తరువాయి భాగంలో ప్రేమ మెడలో తాళి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read