Illu illalu pillalu : ఆమెను అమ్మాలనుకుంటున్న కళ్యాణ్.. ధీరజ్ కాపాడగలడా?
on Jan 7, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -49 లో..... నువ్వు ఇప్పుడు నాతో రాకుంటే చచ్చిపోతానని ప్రేమని కళ్యాణ్ బెదిరించడంతో ప్రేమ వస్తానని చెప్తుంది. బట్టలు సర్దుకుని మొహం కడుక్కోవడానికి వెళ్తుంది. ఆ లోపు కళ్యాణ్ తన గదిలో ఉన్న డబ్బు నగలు బ్యాగ్ లో సర్దుతాడు. ఆ తర్వాత ప్రేమని తీసుకొని బయటకు వస్తాడు. ప్రేమ తన ఇంటిని చూస్తూ తన జ్ఞాపకాలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది.
మరొకవైపు ధీరజ్ ఒక షాప్ దగ్గర ఆపి కూల్ డ్రింక్స్ తీసుకుంటాడు. నేను తాగానని వేదవతి అనగానే.. నువ్వు తాగకుంటే నేను తాగనని ధీరజ్ అంటాడు. దాంతో వేదవతి తాగుతుంది. ఆ తర్వాత ధీరజ్ నర్మద, వేదవతి లు ఒక హోటల్ దగ్గర ఆగి రూమ్ తీసుకుంటారు. నేను తినడానికి ఏమైనా తెస్తానంటూ ధీరజ్ వెళ్తాడు. నేను సాగర్ తో ఫోన్ మాట్లాడి వస్తానంటూ వేదవతికి చెప్తుంది నర్మద.
మరొకవైపు ప్రేమ ఏడుస్తూనే ఉంటుంది. తనని ఇంకా ప్రేమిస్తున్న అంటు ఎంత మంది ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదని ప్రేమకి మాయ మాటలు చెప్తుంటాడు కళ్యాణ్. అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే తనని తీసుకొని వస్తున్న ఏర్పాట్లు చేసుకోండి అంటాడు. ఏం ఏర్పాట్లు అని ప్రేమ అనగానే.. మన పెళ్లికి అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్, ప్రేమ ఇద్దరు వస్తున్న కార్ పంచర్ అవుతుంది. దాంతో ప్రేమని అమ్మే అతనికి ఫోన్ చెయ్యగా అక్కడ ఒక హోటల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. నేను అక్కడికి వస్తానని చెప్తాడు. దాంతో ప్రేమని తీసుకొని ధీరజ్ వాళ్ళున్న హోటల్ కి వెళ్తాడు కళ్యాణ్. మరొకవైపు సాగర్ తో ఫోన్ మాట్లాడుతుంటుంది నర్మద . మరొకవైపు ప్రేమని తీసుకొని కళ్యాణ్ హోటల్ కి వస్తాడు. ధీరజ్ బయట సోఫాలో పడుకొని ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read