Illu illalu pillalu : నాతో వస్తావా చనిపోవాలా అంటూ బ్లాక్ మెయిల్ చేసిన కళ్యాణ్.. సరేనంటూ తనతో వెళ్ళిన ప్రేమ!
on Jan 6, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -48 లో..... వేదవతి నర్మద, దీరజ్ లని రామరాజు దగ్గరుండి గుడికి పంపిస్తాడు. అది చూసి మేము పెళ్లికి పిల్వలేదు కాబట్టి వచ్చిన వాళ్లందరు పెళ్లికి పిల్వలేదా అంటారు కాబట్టి మొహం చెల్లక వెళ్లిపోతున్నారని భద్రవతి అంటుంటే.. వేదవతి బాధపడుతుంది. భద్రవతికి ధీరజ్ ఎదురు సమాధానం చెప్తుంటే రామరాజు ఆపి వాళ్ళని పంపిస్తాడు.
మరొకవైపు కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే ప్రేమ లిఫ్ట్ చెయ్యదు. దాంతో ప్రేమ గదిలోకి వెళ్తాడు కళ్యాణ్. అతన్ని చూసి ప్రేమ భయపడుతుంది. ఎవరైనా చూస్తే బాగోదు వెళ్ళిపోమంటుంది. నేను వెళ్ళనని కళ్యాణ్ అంటాడు. అప్పుడే సేనాపతి ప్రేమ గది డోర్ కొడతాడు దాంతో కళ్యాణ్ దాక్కుంటాడు. సేనాపతి వచ్చి ప్రేమతో మాట్లాడతాడు. తన కూతురిపై ఉన్న ప్రేమని చెప్పి ఎమోషనల్ అవుతాడు సేనాపతి. ఆ తర్వాత సేనాపతి వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు. దాంతో ప్రేమ టెన్షన్ పడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావని సేనాపతి అడుగగా ఏదో ఒకటి చెప్పి ప్రేమ కవర్ చేస్తుంది. సేనాపతి వెళ్ళిపోయాక కళ్యాణ్ వస్తాడు. నువ్వు ఇప్పుడు నాతో రా ఇద్దరం పెళ్లి చేసుకుందామని కళ్యాణ్ అనగానే.. నేను రాను ఇప్పటికే మా చిన్నత్తయ్య చేసిన పనికి ఇప్పటికి బాధపడుతున్నారని ప్రేమ అంటుంది. నువ్వు నాతో వస్తావా ఇప్పుడు చనిపోవాలా అని కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేసి గాజు ముక్కతో చిన్నగా చెయ్ పై కట్ చేసుకుంటాడు. దాంతో ప్రేమ భయపడుతుంది.
ఆ తర్వాత ప్లీజ్ అలా చేయకు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. వస్తానని ప్రేమ అనగానే కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కళ్యాణ్ చేతికి ప్రేమ కట్టుకడుతుంది. ఇక ప్రేమని తీసుకొని కళ్యాణ్ బయటకు వస్తాడు. తరువాయి భాగంలో ఇంటిని చూస్తూ తన జ్ఞాపకాలు గుర్తుచేసుకొని బాధపడుతుంది ప్రేమ. కాసేపటికి ప్రేమని తీసుకొని కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read