Illu illalu pillalu : అన్నకి పెళ్ళి కాకుండా తమ్ముడికి శోభనం.. మామ మాటలకి కోడలు షాక్!
on Dec 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -42 లో..... నర్మద, సాగర్ లకి శోభనం ఏర్పాట్లు చేస్తారు. మరొకవైపు ప్రేమని చూసి వెళ్ళినవాళ్ళు భద్రవతితో ఫోన్ లో మాట్లాడతారు. అప్పుడే సేనాపతి వచ్చి.. ఎవరు ఫోన్ లో.. ఏం అంటున్నారంటూ అడుగుతాడు. అమ్మాయిని రెండు రోజుల్లో పెళ్లి చేసుకొని.. వారం రోజుల్లో అమెరికా తీసుకొని వెళ్తానంటున్నారని చెప్తుంది.
రెండు రోజుల్లో పెళ్లా అని ప్రేమ షాక్ అవుతుంది. రెండు రోజుల్లో చేసేద్దామని విశ్వ అంటాడు. నా మేనకోడలు పెళ్లి అంటే గ్రాండ్ గా చెయ్యాలనుకుంటున్నా కానీ రెండు రోజుల్లో ఎలా అని భద్రవతి అంటుంది. నేను చూసుకుంటానని విశ్వ అంటాడు. దాంతో ప్రేమ కోపంగా లోపలికి వెళ్తుంది. హడావిడిగా ఎందుకు పెళ్లి అని భద్రవతి వాళ్ళ అమ్మ అంటుంది. ప్రేమకి పెళ్లి ఇష్టం లేక కాదు చెప్పకుండా చేస్తున్నామని కోపమని భద్రవతి అంటుంది. మరొకవైపు నర్మద గదిలోకి వెళ్తుంటే.. కామాక్షి ఆడపడుచు కట్నం ఇవ్వకుండా పంపించానంటుంది. దాంతో నర్మద రింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నర్మద గదిలోకి వెళ్తుంది.
నర్మద, సాగర్ లు ప్రేమగా మాట్లాడుకుంటుంటే.. అప్పుడే కామాక్షి ఫోన్ చేస్తుంది. అది వినబడకపోతే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. రింగ్ తులమన్నావ్ అర్థతులమే ఉందని.. రేపు నాకు కొనివ్వాలని అంటుంది. దాంతో సరేనని నర్మద గదిలోపలికి వెళ్తుంటే.. అప్పుడే రామరాజు, వేదవతి లు మాట్లాడుకోవడం నర్మద వింటుంది. పెద్దోడికి పెళ్లి కాకుండా ఇలా నడిపోడికి శోభనమంటే వాడు బాధపడుతాడని రామరాజు అంటాడు. మరి వెళ్లి అపనా అని వేధవతి అనగానే.. నువ్వే పంపించి నువ్వే ఆపుతావా అని రామరాజు అంటాడు. ఆ మాటలన్నీ నార్మద వింటుంది. మరొకవైపు భద్రవతి ప్రేమ దగ్గరికి వస్తుంది. తరువాయి భాగంలో ప్రేమకి పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read