Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్ అదుర్స్.. నర్మద చెప్పిన మాటతో అంతా షాక్!
on Dec 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -38 లో.....రామరాజు ఇంట్లో పూజ జరుగుతుందని తెలిసి అది ఎలాగైనా ఆపాలని ప్రసాదరావుకి భద్రవతి ఫోన్ చేసి.. ఏదో మాట్లాడుతుంది. మరొకవైపు వేదవతి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.... అప్పుడే సాగర్, నర్మద లు రెడీ అయి వస్తారు. వాళ్ళని చూసి.. చూసావా అమ్మ.. అన్నయ్య, వదినలు ఎలా ఉన్నారో అని ధీరజ్ అంటాడు.
ఆ తర్వాత సాగర్, నర్మద లు పూజ దగ్గర కూర్చొని ఉంటారు. తల్లితండ్రలుగా మీరు పక్కన కూర్చోవాలని పంతులు వేదవతికి చెప్తాడు. అత్తయ్య మీరే వెళ్లి మావయ్యని తీసుకొని రండి.. మీరు చెప్తే మావయ్య వస్తాడని నర్మద అంటుంది. వేదవతి రామరాజు దగ్గరికి వెళ్లి.. మీరు రండి మళ్ళీ జనాలు అలా ఇలా అంటూ చెవులు కోరుక్కుంటారని రామరాజుని పూజ దగ్గరికి తీసుకొని వస్తుంది. నర్మద, సాగర్ లతో పాటు రామరాజు, వేదవతి లు కూర్చొని ఉంటారు. పూజ జరుగుతుంటుంది. అప్పుడే ప్రసాదరావు పోలీసులని తీసుకొని రామరాజు ఇంటికి వస్తాడు. రామరాజు అని పిలువగా మీరు పూజ చెయ్యండి అంటూ బయటకు వస్తాడు.
మీ పైన ప్రసాదరావ్ కంప్లైంట్ ఇచ్చాడని తీసుకొని వెళ్తుంటే.. ధీరజ్ వచ్చి ఆపుతాడు. ఆ తర్వాత ఇంట్లో అందరు బయటకు వస్తారు. ప్రసాదరావు కూతురిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారని అందులో మీ హస్తం కూడా ఉందని రామరాజుతో పోలీస్ అంటాడు. వాడు అలాంటి వాడే అంటూ భద్రవతి అంటుంది. రామరాజుని పోలీస్ లు తీసుకొని వెళ్తుంటే.. నర్మద ఆపి నేనేం చిన్న పిల్లని కాదు.. నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాను.. మా మావయ్య గారి గురించి మీకేం తెలుసంటు రామరాజు గురించి గొప్పగా మాట్లాడుతుంది నర్మద. తరువాయి భాగంలో నా కూతురు లేదంటూ ప్రసాదరావు అంటాడు. దాంతో నర్మద బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read