Illu illalu pillalu : శ్రీవల్లిని ఇరికించిన ప్రేమ, నర్మద.. ప్రేమ ఎస్సై కావాలని ధీరజ్ తపన!
on Dec 6, 2025
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Ilu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -334 లో.....శ్రీవల్లి తన పుట్టింటికి వచ్చి ఇవన్నీ జరగడానికి కారణం మీరే.. అసలు నా భర్తతో సంతోషంగా కాపురం చెయ్యట్లేదు. ఎప్పుడు నిజం తెలుస్తుందోనని భయపడుతున్నానని శ్రీవల్లి అంటుంది. ఆ నర్మద, ప్రేమ మంచి వాళ్ళు కాబట్టే వాళ్ళు నిజం చెప్పకుండా ఆగారు.. వాళ్ళ జోలికి నువ్వు వెళ్లకుంటే వాళ్ళు కూడ నీ జోలికి రారు అమ్మ అని ఆనందరావు అంటాడు. చాల్లే చెప్పొచ్చావ్.. ఇప్పుడు మీ మావయ్య వాళ్ళపై కోపంగా ఉన్నాడు.. మనం అనుకున్నది జరుగుతుందని శ్రీవల్లికి భాగ్యం దైర్యం చెప్పి పంపిస్తుంది.
మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. ఎస్ ఐ హల్ టికెట్ ఇస్తాడు. అది చూసి ప్రేమ నేను అప్లై చెయ్యలేదు కదా ఎలా వచ్చిందని అడుగుతుంది. నేనే అప్లై చేసానని ధీరజ్ అంటాడు. ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వెళ్ళాలి అని ధీరజ్ అంటాడు. మావయ్య గారు వద్దని అన్నారు కదా.. ఇప్పుడు తెలిస్తే గొడవ అవుద్దని ప్రేమ అనగానే.. నువ్వేం టెన్షన్ పడకు ఆల్రెడీ చెప్పేసాను కదా.. ఎలాగైనా నిన్ను పోలీస్ చేస్తానని అని ధీరజ్ చెప్తాడు. మరొకవైపు సాగర్ జాబ్ కన్సుల్టేన్సీ దగ్గరికి వెళ్లి జాబ్ గురించి మాట్లాడతాడు. నీకు జాబ్ రాదు.. అసలు క్వాలిఫై కూడా కాలేదని అతను అంటాడు.
సాగర్ బయటకు వస్తాడు. అక్కడ నర్మద కనిపిస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని సాగర్ ని నర్మద అడుగుతుంది. ఫ్రెండ్ దగ్గరికి వచ్చానని కవర్ చేస్తాడు. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. అక్క నువ్వు M.A ఇంగ్లీష్ చదివావు కదా మరి నీ గోల్ ఏముండే అని ప్రేమ అడుగుతుంది. అవన్నీ ఎందుకు ఇప్పుడు చక్కగా అత్తమామలని చూసుకుంటూ వంట పని చేసుకుంటూ ఇంట్లో ఉండాలని శ్రీవల్లి అంటుంది. కావాలనే శ్రీవల్లిని ప్రేమ నర్మద కలిసి ఇరికిస్తారు.అంటే అత్తయ్య నువ్వు లేకుంటే ఏం పని చేసుకోలేదా తనకి సాయం కోసం నువ్వు జాబ్ చెయ్యట్లేదా అని అంటారు. అవునని శ్రీవల్లి అంటుంది. దాంతో వేదవతి కోపంగా.. నువ్వు జాబ్ కి వెళ్ళు అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



