Illu illalu pillalu : ఆమెని అమ్మేయడానికి చూసిన కళ్యాణ్.. సేవ్ చేసిన ధీరజ్!
on Dec 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -32 లో..... నర్మదకి ఆకలి అవుతుంది.. సాగర్ ని పిలిస్తే తను పట్టించుకోకుండా తన బాధలో తను ఉంటాడు. నర్మద వెళ్లి భోజనం చేస్తుంటే.. అప్పుడే వేదవతి వస్తుంది. తనని చూసి తినకుండా నర్మదా ఆగిపోతుంది. వద్దని అనేంత రాక్షసిని కాదు.. ఒక తల్లిని.. ఈ ఇల్లు ఎప్పుడు నవ్వుతు సరదాగా ఉండేది. ఇప్పుడు ఎక్కడివారు అక్కడే ఉన్నారు.. ఇదంతా మీ పెళ్లి వల్ల అని వేదవతి అనగానే.. నర్మద బాధపడుతుంది.
ఆ తర్వాత బాధపడుతున్న ధీరజ్ దగ్గరికి ప్రేమ బిర్యానీ తీసుకొని వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. నీ బిర్యానీ వద్దు.. ఏం వద్దంటూ ధీరజ్ కోపంగా విసిరేస్తాడు. ఆ కళ్యాణ్ గాడితో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి.. వాడు పెద్ద వెస్ట్ ఫెల్లో అని ధీరజ్ అనగానే.. కళ్యాణ్ ని ఒక్క మాట అనకంటూ ప్రేమ అంటుంది. ఆ తర్వాత ప్రేమని కళ్యాణ్ బైక్ మీద సర్ ప్రైజ్ అంటూ తీసుకొని వెళ్తాడు. కళ్యాణ్ వేరొకరికి ప్రేమని అమ్మడానికి రెడీ అవుతాడు. అతని దగ్గరికి తీసుకొని వెళ్తుంటే ప్రేమ వాళ్ళ అన్నయ్య ఎదురుపడతాడు. ఎవరతను అనగానే ఫ్రెండ్ అన్నయ్య.. ఇంటి దగ్గర దింపడానికి వస్తున్నాడని కవర్ చేస్తుంది. ప్రేమ వాళ్ళ అన్నయ్య బైక్ పైన వెళ్తుంటే.. ఛ మిస్ అయిందని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ ధీరజ్ గాడు నాకు ఫోన్ చేసి మీ చెల్లి ఎవరితోనో వెళ్తుందన్నాడని వాళ్ళ అన్నయ్య చెప్పగానే.. ఇది వాడి పనా అని ప్రేమ అనుకుంటుంది.
ఆ తర్వాత ఇల్లు ఎలా ఉండేది.. నీ పెళ్లి వల్ల ఎలా అయింది నడిపోడా అంటూ సాగర్ తో వాళ్ళ మామ అంటాడు. మరుసటి రోజు ఉదయం రామరాజు ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుందా అంటూ భద్రవతి ఫ్యామిలీ చేస్తుంటుంది. సేనాపతి భార్య మాత్రం రామరాజు కొడుకు, కోడలిని బయటకు గెంటేసినట్లు ఉహించుకుంటుంది. కానీ నర్మదా బయటకి వచ్చి తులసి పూజ చేస్తుంది. అది చూసి భద్రవతి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. నర్మద ప్రేమకి హాయ్ చెప్తుంది. తరువాయి భాగంలో ధీరజ్ కి ఫోన్ చేస్తుంది వేదవతి. కానీ లిఫ్ట్ చెయ్యడు. వేదవతి బాధపడడం నర్మద చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read