Karthika Deepam2 : జ్యోత్స్న నిర్ణయం తెలుసుకొని షాక్ అయిన శివన్నారాయణ.. కార్తీక్ పంతం గెలిచింది!
on Jan 9, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -250 లో.....జ్యోత్స్న ఆఫీస్ లో ఉన్న యాభై ఏళ్లకు పైబడిన వారిని తీసేయ్యడంతో వాళ్ళందరూ కార్తీక్ దగ్గరకి వెళ్లి సాయం అడుగుతారు. అసలు విషయం చెప్పడానికి వెళ్లిన కార్తీక్ ని విషయం చెప్పనివ్వకుండా శివన్నారాయణ అడ్డుపడతాడు. ఇక చూసుకుందాం అన్నట్లు కార్తీక్ వెళ్ళిపోతాడు. మరొకవైపు అనసూయ ఊరు నుండి వస్తుంది. ఇల్లు అమ్మకానికి పెట్టి వచ్చానని కాంచనకి చెప్తుంది.
ఆ తర్వాత జ్యోత్స్న తన క్యాబిన్ లో ఉండగా.. సీఈఓ డౌన్ డౌన్ అంటూ కార్తీక్ తో పాటు ఉద్యోగం నుండి తీసేసిన వారు వచ్చి నినాదాలు చేస్తుంటారు. అప్పుడే జ్యోత్స్న వచ్చి మీరేం చేసుకుంటారో చేసుకోండి తగ్గేదేలే అన్నట్లు జ్యోత్స్న పొగరుగా ఉంటుంది. కాసేపటికి శివన్నారాయణకి తన లీగల్ అడ్వైజర్ ఫోన్ చేసి ఆఫీస్ దగ్గర జరుగుతున్న పరిస్థితి చెప్తాడు. దాంతో శివన్నారాయణ షాక్ అయి.. కోపంగా జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. అనుభవమున్న వాళ్ళను తీసేసి ఏం చేయాలనుకుంటున్నావు.. ఇక నోరు ముయ్ అంటూ జ్యోత్స్న పై విరుచుకుపడుతాడు శివన్నారాయణ. ఆ తర్వాత నువ్వు జ్యోత్స్న వెళ్లి సారీ చెప్పి తిరిగి ఉద్యోగంలోకి రమ్మని చెప్పండి అని దశరథ్ తో శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ చెప్పాలని వచ్చింది ఈ విషయమే అనుకుంటా అని సుమిత్ర అంటుంది.
ఆ తర్వాత కార్తీక్ వాళ్లు ధర్నా చేస్తున్న దగ్గరికి జ్యోత్స్న, దశరథ్ లు వస్తారు. తిరిగి ఉద్యోగంలోకి రండి అని వాళ్ళు చెప్తారు. దాంతో కార్తీక్ జిందాబాద్ అంటూ కార్తీక్ ని వాళ్లు ఎత్తుకుంటారు. దాంతో దీప మురిసిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఒకరు.. మీ భార్య ఉంటే మీరు ఏదైనా చెయ్యగలరు సర్ అని అంటాడు. ఆ మాట జ్యోత్స్న వినేలా మళ్ళీ అనండి సర్ అంటూ కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read