Illu illalu pillalu: కూతురు కోసం నగలు తెచ్చిన రేవతి.. గీత దాటిందిగా!
on Apr 8, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-126 లో.. చందు ఎంత మందికి ఫోన్‌లు చేసి డబ్బులు అడిగినా కూడా ఎవ్వరూ ఇవ్వరు. దాంతో శ్రీవల్లికి చందు కాల్ చేసి.. సారీ అండీ.. ఈ మాట మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. ఎంత ప్రయత్నించినా కూడా డబ్బులు అడ్జెస్ట్ కావడం లేదని అంటాడు. ఆ మాట విని శ్రీవల్లి.. అయ్య బాబోయ్ అదేంటి బావా.. ఒకేసారి అంత పెద్ద బాంబ్ పేల్చారు.. ఒకవైపు పెళ్లికి టైమ్ దగ్గర పడుతుంది. ఇప్పుడు డబ్బులు లేవంటే ఎలా బావా? అని అడుగుతుంది. నేనూ అదే టెన్షన్ పడుతున్నాను.. నా వరకూ చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కావడం లేదు. అంత డబ్బు ఎవరు ఇవ్వడం లేదు. అందుకే ఈ విషయం మీ వాళ్లకి చెప్పి ఏదో విధంగా ట్రై చేయమను. మీ నాన్న ఎలాగూ ఫైనాన్స్ బిజినెస్‌లోనే ఉన్నారు కదా.. ట్రై చేయమను అని చెప్పేసి చందు ఫోన్ పెట్టేస్తాడు. దాంతో తన తల్లి భాగ్యాన్ని పిలిచి విషయం చెప్తుంది శ్రీవల్లి. మన ఆశలపై నీళ్లు చల్లేశారు.. నీ ప్లాన్‌పై పిడుగుపడింది.. బావ ఫోన్ చేశాడు.. డబ్బులు దొరకడం లేదట.. మనల్నే చూసుకోమన్నాడని అంటుంది. ఆ మాట వినగానే భాగ్యం గుండెల్లో రాయి పడిపోతుంది. చేప కోసం గాలం వేస్తే.. గాలం కూడా చేప మింగినట్టు.. ఒకేసారి మన ప్లాన్‌లు ఇలా ఫెయిల్ అవుతున్నాయ్ ఏంటని భాగ్యం అంటుంది.
మరి అందుకే చెప్పింది.. పెనం ఎంత ఉంటే దోసె అంతే వేసుకోవాలని అని పెనం కంటే పెద్ద దోసె వేస్తే ఇలాగే అవుతుంది. మన స్థాయికి తగ్గ సంబంధం చూస్తే సరిపోయేది కదా.. ఇప్పుడు చూడు మొదటికే మోసం వచ్చిందని భాగ్యం భర్త అంటాడు. దాంతో భాగ్యం.. ఎహే ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చావంటే.. అట్లకాడ ఇరిగిపోద్దని వార్నింగ్ ఇస్తుంది. అది కాదు ఆవిడ గారండీ.. కూసంత కోపం తెచ్చుకోకుండా ఆలోచించండీ.. డబ్బులు లేకుండా పెళ్లి ఎలా చేస్తామని అంటాడు. నాకూ అదే అర్థం కావడం లేదు.. టెన్షన్‌తో బుర్రబద్దలైపోతుందని భాగ్యం అంటుంది. ఇక పెళ్లై ఇన్నాళ్లు అయినా శోభనం కానీ సాగర్, నర్మద ఎప్పటిలాగే కళ్లతోనే కాపురం చేస్తుంటారు. భార్య అందానికి ముగ్దుడైన సాగర్ పేపర్‌పై ఐ లవ్యూ అని రాసి.. దాన్ని రాకెట్‌లో చేసి నర్మద కోసం విసురుతాడు. అది చూసిన నర్మద.. నేను స్వీట్స్ పనిలో ఉన్నాను.. రావడం కుదరదని సైగ చేస్తుంది. ఆ లవ్ లెటర్ రాకెట్‌ని అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది. సరిగ్గా అప్పుడే ప్రేమ వచ్చి.. అదే ప్లేస్‌లో కూర్చుంటుంది. ఇక ధీరజ్ కూడా అప్పుడే వచ్చి ఆమె వెనుకనే కూర్చుంటాడు. అతని చేతిలో పుస్తకం చూసి.. ఐ లవ్యూ అని రాసి.. తన కోసమే ఆ రాకెట్ వేశాడని ప్రేమ అనుకుంటుంది. వెంటనే ధీరజ్ దగ్గరకు వెళ్లి.. రేయ్ ఏంట్రా ఇదీ అని ఆ లెటర్‌లో రాసింది చూపిస్తుంది. కళ్లు దొబ్బాయా? చూసి చదువుకోమని ధీరజ్ అంటాడు. ఏంట్రా చూసేదీ.. నీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఎప్పటి నుంచే ఉందన్నమాట. పైకి మాత్రం చిరాకుగా ఉన్నట్టు నటిస్తున్నావ్.. ఐ లవ్యూ అని నాకెందుకు రాశావ్ రా అని ప్రేమ నిలదీస్తుంది. దాంతో ధీరజ్ పెద్దగా నవ్వి.. ఛీ ఛీ నేను నీకు ఐ లవ్యూ అని రాయడం ఏంటి.. జోక్ బాగుందని అంటాడు. నువ్వే రాశావని ప్రేమ, రాయలేదని ధీరజ్ ఇద్దరు కాసేపు గొడవ పడతారు. ఇక నర్మద.. తన కోసం తన తల్లి ఇచ్చిన నగల్ని చూసి మురిసిపోతుంది. వీటిని చూసినప్పుడల్లా.. మీరు నా దగ్గరే ఉన్నట్టు ఉంటుందంటూ ఆ నగల్ని అలంకరించుకుంటుంది. ఇంతలో ప్రేమ రావడంతో.. ఈ నగలు ఎలా ఉన్నాయ్ ప్రేమా అని అడుగుతుంది. నీకు చాలా బాగున్నాయ్ అందంగా ఉన్నాయని అంటుంది. కానీ తనకి కూడా అలాంటి అదృష్టం ఉంటే బాగుండని మనసులో అనుకుంటుంది. ఏమైంది ప్రేమ అని నర్మద అడగడంతో.. ఏం లేదని అంటుంది. నాకు తెలుసు ప్రేమ.. మీకు మీ వాళ్లు గుర్తొచ్చారు కదా.. నన్ను అర్థం చేసుకున్నట్టే నిన్ను మీ వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు. ఏదోరోజు నీ కోసం మీ వాళ్లు వస్తారు బాధపడకు ప్రేమ అని నర్మద అంటుంది.
నీ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది అక్కా.. మీ వాళ్లకి నీపై వాళ్లకి నచ్చని వాళ్లని చేసుకున్నావనే కోపం మాత్రమే ఉంది. కానీ మా వాళ్లకి ఈ ఇంటిపై పాతికేళ్ల పగ ఉంది. మా చిన్న అత్త పాతికేళ్లుగా ఇంటి ముందున్నా సరే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది.. మా వాళ్లు నా కోసం వస్తారా.. నేను కనపడితే మా వాళ్లు కనీసం నా వైపు కూడా చూడటం లేదు. కనీసం మా అమ్మ కూడా నాతో మాట్లాడటం లేదు. నేను ఎన్నిసార్లు పలకరించినా నా మొహం కూడా చూడటం లేదని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఆమె తల్లి రేవతి మాత్రం.. కూతుర్ని కలుసుకోవడానికి అన్నీ రెడీ చేస్తుంది. చీర, నగలు, పసుపుకుంకుమలు కూతురు కోసం సిద్ధం చేస్తుంది. శారదాంబ చూసి.. ఇవి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావని అడుగుతుంది. నా కూతురు కోసమని రేవతి అనేసరికి శారదాంబ ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కనీసం నీ కూతుర్ని నువ్వైనా అర్థం చేసుకున్నావ్.. చాలా సంతోషంగా ఉందే.. మా అమ్మైనా అర్థం చేసుకుందని నీ కూతురు ఇంకా సంతోషపడుతుందేమోనని శారదాంబ ఎమోషనల్ అవుతుంది. నా కూతురిపై కోపం పోయిందో లేదో నాకు తెలియదు కానీ ఈ కన్నతల్లి ప్రేమ మాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది. నా కూతురుకి ఏలోటూ రాకూడదు. ఇవి నా కూతురి నగలు.. ఇవి దానికే చెందాలి.. దాని దగ్గర ఉండాలని రేవతి అంటుంది. సరే.. మీ ఆయన, వదినచూడకుండా జాగ్రత్తగా వెళ్లమని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది శారదాంబ. ఇంటి ముందు ఉన్న గీతని దాటి రామరాజు ఇంటి గేట్లను తెరుచుకుని కూతురు కోసం రేవతి నగలు, చీరని తీసుకుని వెళ్తుంది. ప్రేమా.. ప్రేమా అని పిలిచేసరికి.. ప్రేమకి ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. తల్లిని చూసి ఎమోషనల్ అయిపోతుంది. తరువాయి భాగంలో చందుని శ్రీవల్లి కలిసి.. డబ్బులు లేకపోతే పెళ్లి ఆగిపోతుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్లకి కరిగిపోయిన చందు.. అప్పు కోసం ఓ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. సరిగ్గా అప్పుడే రామరాజు కూడా అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
