Illu illalu pillalu : వారి ఎంగేజ్ మెంట్ లో ధీరజ్ ని క్షమించిన రామరాజు.. టెన్షన్ లో భాగ్యం!
on Mar 30, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-119 లో... ఏంటి ఇంటింటికి తిరిగి వాటర్ క్యాన్ లు వేస్తున్నావా అని ధీరజ్ గురించి భాగ్యం ధీర్గాలు తీసి మాట్లాడుతుంటుంది. పని చేస్తున్నారు తన కష్టంతో బ్రతకాలని అనుకుంటాన్నాడు అయితే తప్పేముంది ఎందుకు అలా మాట్లాడుతున్నారని భాగ్యం కి తన మాటలతో బుద్ది చెప్తుంది ప్రేమ. పెళ్లి అయ్యాక నా కూతురు ఆ ఇంట్లో అడుగుపెట్టాకా దీని సంగతి కూడా చెప్పాలని భాగ్యం ప్రేమ గురించి అనుకుంటుంది.
ధీరజ్ కి సపోర్ట్ గా ప్రేమ మాట్లాడడంతో వేదవతి, నర్మద హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ వెళ్లిపోతుంటాడు. వచ్చావ్ కదా ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఉండు ఈ మెమోరీస్ గుర్తుంటాయని ధీరజ్ ని ప్రేమ ఆపుతుంది. తమ్ముడు ఉంటాడు నాన్న అని సాగర్, చందు ఇద్దరు రామరాజుని రిక్వెస్ట్ చేస్తుంటే సైలెంట్ గా వెళ్లిపోతాడు. నాన్న ఏం అనలేదు అంటే ఒప్పుకున్నట్లే ఉండు.. మన ముగ్గురికి సేమ్ బట్టలు తీసుకొని వచ్చామని చందు అంటాడు. ముగ్గురు సేమ్ బట్టలు వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. అందరు సంతోషం గాడాన్స్ చేస్తారు. ఇప్పటివరకు ఎలా ఉండేవాళ్ళు నీ రాకతో ఎంత హ్యాపీగా ఉన్నారు.. నువ్వు రావడం నాకు సంతోషమే చిన్నోడా కానీ ఎందుకు నా పరువు తీసే పనులు చేస్తున్నావని రామరాజు అనుకుంటాడు.
ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ అయితే జరిగింది కానీ పెళ్లి ఎలా జరుగుతుందో అని భాగ్యం వాళ్ళు టెన్షన్ పడతారు. మరొకవైపు చందు, సాగర్, ధీరజ్ రామరాజు దగ్గరికి వచ్చి తమ్ముడిని క్షమించండి అని రామరాజుని చందు రిక్వెస్ట్ చేస్తారు. పెళ్లి లో ఏ గొడవలు రాకుండా వీడి వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఉంటే క్షమిస్తానని రామరాజు అనగానే.. ముగ్గురు రామరాజుని హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్లి.. మా నాన్న ఈ పెళ్లి నా వల్ల ఏ గొడవలు లేకుండా జరిగితే నన్ను క్షమిస్తారు.. అందుకు నీ హెల్ప్ కావాలని అడుగుతాడు.
తరువాయి భాగంలో రామరాజు కుటుంబం మొత్తం పెళ్లి హడావిడి లో బిజీగా ఉంటారు. అందరు హ్యాపీగా ఉంటారు.. మరొకవైపు ఈ పెళ్లి ఎలా చెయ్యాలని భాగ్యం కుటుంబం టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
