Illu illalu pillalu : తెలివితో చందుని అరెస్ట్ చేపించిన భద్రవతి.. ఆ పెళ్ళి క్యాన్సిల్ !
on Mar 22, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -112 లో.... రామరాజు పై చెయ్ వేసినందుకు విశ్వని కొడుతాడు ధీరజ్. తనతో పాటు చందు కూడా విశ్వని కొడుతాడు. ఇద్దరిని తిరుపతి ఆపుతాడు. ఇక మీదట మాజోలికి వస్తే ప్రాణం తీసేస్తా అంటూ ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు... ఒళ్ళంతా దెబ్బలతో విశ్వ ఇంటికి వస్తాడు. ఏమైందని భద్రవతి అడుగుతుంది. జరిగింది మొత్తం విశ్వ చెప్తాడు. నా కొడుకు పై చెయ్ వెయ్యడానికి ఎంత దైర్యమని రామరాజు ఇంటి మీదకి సేనాపతి వెళ్తుంటే భద్రవతి ఆపుతుంది.
మనం చెయ్యాల్సింది గొడవ కాదు.. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ చందు గాడి గురించి త్వరలో పెళ్లి అని ఆ రామరాజు మురిసిపోతున్నాడు వాడి సంగతి చెప్పాలి.. నేను చెప్పినట్టు చెయ్ అంటు విశ్వకి భద్రవతి చెప్తుంది. మరొకవైపు రామరాజు, వేదవతి ఇద్దరు భాగ్యం దగ్గరికి వస్తారు. చందు, శ్రీవల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చామని రామరాజు అంటాడు. నేను ఆలోచిస్తానని చెప్పాను కదా అని భాగ్యం అంటుంది. ఈ పెళ్ళి ఎలాగైనా జరగాలంటూ రామరాజు రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో భాగ్యం సరే అంటుంది. ఆ తర్వాత చందు తిరుపతి వస్తుంటే పోలీసులు ఆపి చందుని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అని చందు అడుగగా.. విశ్వ అనే అతన్ని కొట్టారట అందుకే అని చందుని తీసుకొని వెళ్తారు పోలీసులు.
తిరుపతి కంగారుపడుతూ ధీరజ్, సాగర్ లకి చందు అరెస్ట్ గురించి చెప్తాడు. మరొకవైపు పెళ్లికి భాగ్యం ఒప్పుకుందని రామరాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ చాల మంచివాడు మీరు తప్పుగా అపార్ధం చేసుకుంటున్నారని వేదవతి అంటుంది. అప్పుడే తిరుపతి వచ్చి చందు అరెస్ట్ గురించి చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. మరుసటిరోజు స్టేషన్ దగ్గరికి భాగ్యం వాళ్ళు వెళ్తారు. మీ కొడుకుకి నా కూతురినిచ్చి గొంతు కొయ్యలేను ఈ పెళ్లి జరగదని రామరాజుతో భాగ్యం చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
