Illu Illalu pillalu: చందుని శ్రీవల్లి నిజంగానే ప్రేమిస్తుందా.. రామరాజు ఫుల్ హ్యాపీ!
on Apr 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లాలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-120లో.. భాగ్యం తన కుటుంబాన్ని తీసుకొని గుడికి వెళ్తుంది. ఇక నీ పెళ్లి ఆగదని శ్రీవల్లితో భాగ్యం అంటుంది. మరి పెళ్ళి చేయాలంటే ధనలక్ష్మి కావాలి కదా అని భాగ్యం భర్య అడుగగా.. ఓస్ అదా.. మన అమ్మాయి పెళ్ళికి కర్త,కర్మ,క్రియ అన్నీ మన అల్లుడు గారే అని భాగ్యం అంటుంది. అమ్మోయ్.. పాపమే.. బావ వట్టి అమాయకుడే.. ఆయన నాకు చాలా బాగా నచ్చారు. నాకు తెలియకుండానే ఇష్టం పెంచుకున్నాను. ఆయనతో నా పెళ్లైతే నా జీవితం బాగుంటుందనే నమ్మకంతో ఉన్నానే.. అట్టాంటి మనిషిని మోసం చేయడం తప్పు కదమ్మా అని శ్రీవల్లి అంటుంది. అస్సలు తప్పుకాదే అమ్మడూ.. నీకు పెళ్లి సంబంధం చూసినప్పుడే నీకు క్లియర్‌గా చెప్పా.. మీ అయ్యని నేను పెళ్లి చేసుకుని నేను బతుకుతున్న దరిద్రపు బతకుని బతకనీయను అని.. అందుకోసం నేను వంద అబద్ధాలు చెప్పడానికైనా వెయ్యి మోసాలు చేయడానికైనా వెనకాడనని భాగ్యం తల్లి ప్రేమని చెప్పుకొస్తుంది.
పేదరికం గురించి చెప్తే.. అయ్యో పాపం అని జాలిపడతారు తప్పితే.. నిన్ను కోడలిగా చేసుకోరు. నిన్ను ఆ ఇంటి కోడలిగా చేయడానికి నేను వెళ్తున్న రూటే కరెక్ట్. నీ మనసుని అటూ ఇటూ పట్టాలు తప్పించకుండా నా రూట్లోనే ఫాలోయింగ్ అయిపో’ అని అంటుంది. సరే మా అమ్మ ఎలాగంటే అలా అని ఊకొట్టేస్తుంది శ్రీవల్లి. అవునే అమ్మా.. అక్క పెళ్లికి డబ్బులెక్కడనుంచి వస్తాయే అని అంటే.. అన్నింటికీ కర్త, కర్మ, క్రియ బావగానే అని చెప్తున్నావ్.. అది ఎలాగో చెప్పడం లేదు.. అదెలాగే అని భాగ్యం చిన్నకూతురు అడగడంతో.. అదెలాగో చెప్తాగా చెప్తా అని అంటుంది భాగ్యం.
మరోవైపు రామరాజు హ్యాపీగా గుడికి వెళ్ళి శుభలేఖలు ఇచ్చి అర్చన చేయిస్తాడు. ఇక ఇంటికి తిరిగి వెళ్తూ ఓ దుకాణం దగ్గర ఆగుతాడు. మీ పెద్దోడికి పెళ్లి కావడం కష్టమే అని గతంలో తనని అవమానించిన చోటే ఆగి.. మా పెద్దోడి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. మావాడికి మంచి సంబంధం చూశాను.. ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరకడం అరుదు అని రామరాజు చెప్తాడు. మొత్తానికి పట్టువదలని విక్రమార్కుడిలా మీ పెద్దోడి పెళ్లి చేస్తున్నావ్ అన్న మాట అని అంటారు అక్కడున్న వాళ్లు. నేను ఎవరికీ ద్రోహం చేయలేదండీ.. మరి నా కొడుక్కి ఆ దేవుడు ఎందుకు ద్రోహం చేస్తాడు.. శుభలేఖలు ఇంటికి వచ్చి ఇస్తానంటూ అక్కడ నుంచి రామరాజు ఇంటికి వెళ్లిపోతాడు. తరువాయి భాగంలో.. ధీరజ్, ప్రేమల మధ్య సీన్ బాగుంది. పుణ్యమేదో చేసి ఉంటానే.. నేను నిన్ను పొందానే.. నా ఫేవరేట్ నా పెళ్లమే అంటూ మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ మరీ ధీరజ్, ప్రేమలు రొమాన్స్ చేసేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
