మీ ఇద్దరి మధ్య ఏ విభేదాలు రాకుండా నేను చూసుకుంటాను!
on Apr 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -135 లో.. మా పెద్దమ్మ, కృష్ణలకి మాటిచ్చానని మురారి ఆలోచిస్తుంటాడు. మరోవైపు కృష్ణని తీసుకొని రేవతి మేడపైకి వెళ్తుంది. అసలు ఏం చేస్తున్నావ్ కృష్ణ అని రేవతి అడుగుతుంది.. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపి గౌతమ్ సర్ తో నందిని పెళ్లి చేస్తానని కృష్ణ అంటుంది. మధ్యలో నీ కాపురం ఏమవుతుందో అని నాకు టెన్షన్ గా ఉంది కృష్ణా అని రేవతి అనగానే.. మీరేం టెన్షన్ పడకండి.. ఏసీపీ సర్ నాకు మాటిచ్చాడు.. నందు గురించి ఏసీపీ సర్ కి నిజం చెప్పాను.. అంతా సర్ చూసుకుంటానని అన్నాడని కృష్ణ అంటుంది. అటు వాళ్ళ పెద్దమ్మకి మాటిచ్చాడు. ఇటు నీకు ఇచ్చాడని రేవతి అంటుంది. భవాని అత్తయ్యకి కూడా మాట ఇచ్చాడా అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. ఏసీపీ సర్, భవాని అత్తయ్యల మధ్య ఏ విబేధాలు రాకుండా నేను చూసుకుంటాను.. మీరు వెళ్లి ప్రశాంతంగా పడుకోండని రేవతికి చెప్పి తనని పంపించేస్తుంది కృష్ణ.
ఆ తర్వాత రేవతి కిందకి వస్తుంటే.. భవాని, ఈశ్వర్ లు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు నన్ను ఆరా తీస్తారు.. నేనే వాళ్ళని రివర్స్ లో వెళ్లి అడుగుతానని రేవతి అనుకొని భవాని దగ్గరికి వెళ్తుంది రేవతి. ఏం మాట్లాడుకుంటున్నారు నాకు చెప్పకూడనివా అంటూ రేవతి అనేసరికి.. కంపెనీ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాము. నీకు ఇవేం అర్ధం కావు.. లోపలికి వెళ్ళమని భవాని అనగానే.. రేవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత మురారి దగ్గరికి కృష్ణ వచ్చి వాటర్ తాగండని ఇస్తుంది. అప్పుడు మురారి వాటర్ తాగుతాడు. ఇప్పటి వరకు ఇది నిండు గ్లాస్ ఇప్పుడు ఖాళీ గ్లాస్.. మీ మనసులో భారం కూడా రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆ బాధ తీరిపోతుందని కృష్ణ అంటుంది. మీకు ముందే నందు విషయం చెప్తే బాగుండని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. మీకు మీ పెద్దమ్మకి మధ్యలో ఎలాంటి విభేదాలు రాకుండా అంతా నేను చూసుకుంటానని కృష్ణ అనగానే.. నువ్వు అన్నంత ఈజీ కాదు కృష్ణ.. ఈ ఇంటికి సంబంధించిన పరువు గురించిన విషయం ఇది కృష్ణ అని మురారి అనగానే.. నేను నందు జీవితం బాగుచెయ్యాలని చూస్తున్నా అని కృష్ణ అంటుంది. పెద్దమ్మ నిన్ను ఏం అంటుందోనని మురారి అనగానే.. ఏం అంటుంది ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంది.. ఎలాగూ వెళ్లిపోయేదాన్ని కదా.. కాస్త ముందుగా వెళ్తానని కృష్ణ అంటుంది. నువ్వు వెళ్లిపోవడం గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావు.. నాకేంత కష్టంగా ఉంటుందో తెలుసా కృష్ణ అని తన మనసులో అనుకుంటాడు మురారి. ఇక వెళ్లి భోజనం చేద్దామని కృష్ణ అంటుంది.
ఆ తర్వాత ఉదయం అందరు కల్యాణ మండపంకి బయలుదేరడానికి హాల్లోకి వస్తారు. కృష్ణ పైనుండి కిందకి వస్తుంటుంది. అందరూ సైలెంట్ గా ఉండండి.. ఆ తింగరి పిల్ల వస్తుందని భవాని అంటుంది. ఆ తర్వాత ఎం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
