ఫైమా కాళ్ళు పట్టుకున్న హైపర్ ఆది...
on Jan 8, 2025
"ఈ సంక్రాంతికి వస్తున్నాం" అంటూ ఒక షో త్వరలో సంక్రాంతి పండగకి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. ఈ షోకి సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమోలోనో షో మొత్తం చూపించేసారు మేకర్స్. ఇక హైపర్ ఆది మాత్రం ఎక్కడా తగ్గేదెలా అన్నట్టు చేసాడు. ట్రెండింగ్ లో ఉన్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ గెటప్ తో వచ్చి ఆడియన్స్ కి కనువిందు చేసాడు. అల్లు అర్జున్ లా ఆది నటిస్తే శ్రీవల్లి రోల్ లో ఫైమా చేసింది. ఆదిని సర్ప్రైజ్ చేయడానికి ఫైమా వెనక నుంచి వచ్చి సామి..అంటూ హగ్ చేసుకుంది. ఆ హగ్ కి ఆది షాకైపోయాడు. "నెలకోసారి నాలుగు ఈవెంట్లకు వెళ్లి బాగా అలవాటైపోయింది నీకు ఇలా అందరినీ హగ్ చేసుకోవడం" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక మూవీలో పుష్ప రాజ్ శ్రీవల్లి కాళ్ళను మూవీలో పట్టుకోవడం చూసాం. ఆది అదే ఇక్కడి షోలో దించేసాడు.
"ప్రేమలో ఐనా, పౌరుషంలో ఐనా తగ్గేదెలా" అంటూ ఆది ఫైమా కాళ్ళు పట్టుకునేసరికి అందరూ షాకైపోయారు. శేఖర్ మాష్టర్ ఐతే గట్టిగా అరిచేసాడు. ఇక నెటిజన్స్ ఐతే హైపర్ ఆది నటన చూసి కేక..ఫైమా కాళ్ళు కూడా పట్టుకున్నాడు అసలు...స్టేజి మీద ఎంతమంది ఉండనీ కానీ..అందరికీ రిజిస్టర్ అయ్యేలాగా స్కిట్ చేయాలి అంటే అది ఆదికే సొంతం" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. . ఇక షెకావత్ గెటప్ లో ఆటో రాంప్రసాద్ వచ్చాడు. అతన్ని చూసిన ఆది "దమ్ముంటే పట్టుకోరా ఆటోగాడా...పట్టుకుంటే వదిలేస్తా తుక్కుగూడ...మళ్ళీ భుజాన బ్యాగేసి, సాఫ్ట్ వేర్ జాబ్ కెళ్తా ఆఫీస్ కేసి" అంటూ పాటపాడేశాడు ఆది. ఇదొక్కటే కాదు గంగానమ్మ గెటప్ లో సిల్వర్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ రికార్డ్స్ బద్దలు కొడితే ఇక్కడ స్మాల్ స్క్రీన్ మీద ఆది రికార్డ్స్ బద్దలు కొట్టాడు.
Also Read