గుర్రం ముఖందానా.. సోనియా పరువు తీసేసిన ఆది
on Feb 2, 2025
ఢీ జోడి లేటెస్ట్ ప్రోమోలో గెటప్ రౌండ్ ఇవ్వండంతో ఇటు ఆది, అటు సిద్దు వాళ్ళు డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆది, సిద్దు రాజు గెటప్స్ లో వచ్చారు. సోనియా ఆదిని చూసి "నువ్వు రాజువంటే నేను నమ్మాలా ఇప్పుడు" అంటూ కామెడీ డైలాగ్ వేసింది. దానికి ఆది కౌంటర్ ఇచ్చాడు. "ఏ ఆ లంగా వేసుకున్నోడు రాజు అంటే నమ్మలేదా నువ్వు " అంటూ సిద్దు రాజు గెటప్ గురించి చెప్పేసరికి సిద్దు పెద్ద ఫూల్ అయ్యాడు. "కాదు సిద్దు మన గుర్రానికి అస్వస్థత వచ్చింది. దానికి ఎం పెట్టినా తినట్లేదు" అంది సోనియా. "రాదా మరి..ఈ గుర్రం ముఖాన్ని చూస్తే గుర్రానికి కూడా అస్వస్థతే వస్తుంది" అంటూ ఆది కౌంటర్ ఇచ్చాడు.
ఇక ఆది రాజు గెటప్ ని చూసి "ఎవడు వీడు పగటి వేషగాడిలా ఉన్నాడు" అని హోస్ట్ నందు అన్నాడు. "హే వేషగాడు కాదు వేటగాడు అంది" అశ్విని. దానికి ఆది "నువ్వు అంత సిగ్గుపడుతూ చెప్పకు. నేను నిన్ను నిజంగా వేటాడాను అనుకుంటారు" అనేసరికి అశ్విని పెద్ద ఫూల్ అయ్యింది. "ఏమాటకు ఆ మాటా మా ఆవిడ అధరాలు ఉంటాయి." అన్నాడు ఆది. "ఏవండీ ప్లీజ్ అండి అవన్నీ నమ్మకండి అవన్నీ ఉత్తి మాటలు" అంది. "అది ఆధారాలు కాదే. అధరాలు" అంటూ అశ్విని పరువు తీసేసాడు ఆది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
