Home

»

Tv News

ముగ్గుతో నిన్ను ఫాలో అవుతా.. అందుకే మా ఆయన్ని చంపేస్తాను!

Mar 14, 2026

ఉగాది స్పెషల్ గా ఢీ 20 రాబోతోంది. అందులో ఫైమా, ఆది, పూజ, బిన్నీ మాష్టర్ వేసిన ఫైమా ప్రశ్నలు ఆది  పంచులు మాములుగా లేవు. పూజ కన్నీళ్లు పెట్టేసుకుంది. ఫైమా స్టేజి మీదకు రాగానే ఫైమా ఆది కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది. "గురువుగారు మా ఆయన గురక పెడుతున్నాడు.. అందుకే మా ఆయన్ని చంపేద్దామనుకుంటున్నా. " అని ఫైమా అనేసరికి "గురక పెడితే దాని చెవిలో దూది పెట్టాలి వాడి  ముక్కులో దూది పెట్టకూడదు" అంటూ పరిష్కారం చూపించాడు. "ఈ సంవత్సరం నాకెలా ఉండబోతోందో చెప్పండి " అని హోస్ట్ నందు అడిగాడు. "నీదే రాశి" అన్నాడు "కుంభ రాశి" అన్నాడు నందు. "అబ్బే కుంభ రాశి గురించి  తెలీదు " అన్నాడు ఆది.

"నాది మకరం రాశి " అంటూ ఫైమా ఎగబడి చెప్పింది. "మకరం గురించి ఎందుకు పైన పోయిన ఎకరం గురించి ఆలోచించు " అంటూ ఫైమాని ఎగతాళి చేసాడు. "నా మీద ఏ నర దృష్టి పడకుండా ఉండాలంటే ఎం చేయవలెను " అని డాన్సర్ పూజ అడిగింది.   "నేనొక మంత్రించిన ముగ్గు ఇస్తాను. ఆ ముగ్గును నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటి వరకు చల్లుకుంటూ వెళ్ళు" అన్నాడు ఆది.

ఇంతలో ఫైమా మధ్యలోకి వచ్చేసింది. "మొన్న అడ్రెస్స్ అడిగితే ఇవ్వాలా ఆ ముగ్గురు ఫాలో ఐతే " అంటూ కామెంట్ చేసాడు. తర్వాత పూజ చేసిన డాన్స్ కి బిన్నీ మాష్టర్ ఫిదా ఐపోయాడు. "పూజ నువ్వు క్లాసికల్ డాన్సరా..ఎక్కడా అలా అనిపించలేదు పూజా చాల చాల బాగా చేసావు " అని బిన్నీ మాష్టర్ అడిగేసరికి "లేదు మాష్టర్ నేను నాన్ క్లాసికల్ డాన్సర్. నేను ఢీకి చాలా చాలా రుణపడి ఉంటాను. నేను ఇంటికి వెళ్ళిపోయినా, వేరే ఏదైనా పెద్ద స్టేజికి వెళ్లినా ఢీకి థ్యాంక్ ఫుల్ గా ఉంటాను" అని చెప్పింది.  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com