మంచులో ఆది - సౌమ్య జోడి... పెళ్లి చేసుకోండి మంచిగా అంటూ నెటిజన్స్ సలహా
on Dec 4, 2025

బుల్లితెర మీద హైపర్ ఆది బాగా ఫేమస్. ఐతే సౌమ్య శారదా కూడా ఒక మోస్తరు యాంకర్ గా ఫేమస్ అయ్యింది. ఇక వీళ్లిద్దరు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ లో జోడిగా నటించారు. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి స్విజర్లాండ్ ట్రిప్ వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ మంచులో ఇద్దరు కలిసి మంచు గడ్డల్ని ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఆదుకున్నారు. అలాగే ఒక సాంగ్ కి డాన్స్ కూడా వేశారు. "నా మనసుకేమయింది" అనే పాటకు స్టెప్పులేశారు. "ఈ ఒక్క వీడియోలోనే కొరియోగ్రఫీ 100 సార్లు చచ్చిపోయింది" అంటూ కాప్షన్ పెట్టారు.
ఇక నెటిజన్స్ ఐతే వీళ్ళ డాన్స్ ని వీళ్ళ జోడిని చూసి రకరకాల కామెంట్స్ చేసారు. "సూపర్బ్, ఇక్కడే ఫుల్ చలిగా ఉంటే మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళావన్న, మీరెందుకు ఇద్దరూ పెళ్లి చేసుకోకూడదు ?, నైస్ కపుల్..మేడ్ ఫర్ ఈచ్ అదర్, సూపర్బ్ జోడి, ఆది అన్నకు పెళ్లి కళ వచ్చేసింది, గుడ్ కపుల్, జబర్దస్త్ కపుల్, అన్నా పెళ్ళెప్పుడు, వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఆది అన్న పొలంలో మొలకలు వచ్చాయ్, పెళ్లి చేసుకోండి మంచిగా" అంటూ చెప్తున్నారు. సౌమ్య కొంతకాలం జబర్దస్త్ కి యాంకర్ గా చేసింది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన షోకి దూరమయ్యింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది. అక్కడ నుంచి కూడా వెళ్ళిపోయింది. ఇక షోస్ ప్రస్తుతానికి ఎక్కడా కనిపించడం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



