Podharillu: చక్రి వాళ్ళింట్లో మహా.. తెల్లారితే ఏం జరగనుంది!
on Jan 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -34 లో...మహా, చక్రిల శోభనం కోసం కేశవ, మాధవ గది డెకరేషన్ చేస్తారు. అది చూసి చక్రి షాక్ అవుతాడు. ఇది గానీ ఆ అమ్మాయి చూసిందంటే నాకుందనుకొని భయపడుతాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నయ్య.. మేం ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నామో తెలుసు కదా.. వాడితో పెళ్లి ఇష్టం లేక ఇంట్లో నుండి బయటకు వచ్చి తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు ఇదంతా అంటే డిస్టబ్ అవుతుందని చక్రి అనగానే సరే అని రూమ్ మొత్తం చేంజ్ చేస్తారు.
మీరు వెళ్లి గదిలో పడుకోండి అని మహాకి చెప్తారు. మహాతో పాటు చక్రి కూడా లోపలికి వస్తుంటే.. మీరు ఎందుకు వస్తున్నారని మహా అడుగుతుంది. బయటకు వెళ్తే వాళ్ళతో ప్రాబ్లమ్.. లోపల ఉంటే మీతో ప్రాబ్లమ్ అని చక్రి అనుకుంటాడు. చక్రి బయటకు వెళ్లి వాళ్ళ అన్న పక్కన పడుకుంటాడు. మహా గడియ పెట్టుకోబోతుంటే దానికి గడియ ఉండదు. భయంతో పడుకోకుండా ఉంటుంది. మరొకవైపు నువ్వు ఎందుకు ఇక్కడ పడుకున్నావని చక్రిని మాధవ అడుగుతాడు. చెప్పాను కదా అన్నయ్య మళ్ళీ అడుగుతావని చక్రి అంటాడు. ఆ తర్వాత చక్రి మొదటగా మహాని చూసింది.. వాళ్ళకి చెప్తాడు. మళ్ళీ అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదని హ్యాపీగా ఫీల్ అవుతాడు.
మరొకవైపు మహా నిద్రపోకుండా ఆలోచిస్తుంటే చక్రి వచ్చి ఇంతమంది మగాళ్లు ఉన్నారని భయపడుతున్నారు కానీ అలా భయపడకండి.. మా ఇంట్లో ఆడవాళ్లు లేరు మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటాం.. బయట నలుగురు సైనికులు కాపలా ఉన్నారని హాయిగా పడుకోండి అని చెప్పి చక్రి వెళ్తాడు. దాంతో మహా పడుకుంటుంది. వాళ్ళ నాన్న సడెన్ గా గుర్తువచ్చి నిద్రలేస్తుంది. మళ్ళీ పడుకుంటుంది. మరుసటి రోజు హోటల్ దగ్గరికి వెళ్తాడు నారాయణ. అక్కడ నారాయణ వాళ్ళ అన్నయ్య ఉంటాడు. చూసావా మా ఇంటి కోడలు అని గొప్పగా చెప్తాడు నారాయణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



