Illu illalu pillalu : అమూల్య నిజం చెప్తుందేమోనని ప్రేమ టెన్షన్!
on Feb 5, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -386 లో.. రామరాజు హాస్పిటల్ లో ఆ సిచువేషన్ లో ఉంటే భాగ్యం, ఆనందరావు ఇద్దరు భోజనం చేస్తుంటారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఆ విశ్వ గాడు ఏదో మాట్లాడుతా అమూల్యని తీసుకొనిరా అన్నందుకు తీసుకొని వెళ్ళాను కానీ వాడు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటని శ్రీవల్లి కంగారు పడుతుంది. ఏం కాదని భాగ్యం శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తుంటే.. దూరం నుండి నర్మద చూస్తుంది. నర్మద చూసిందని శ్రీవల్లి వెంటనే టేబుల్ కింద దాక్కుంటుంది.
శ్రీవల్లి నన్ను చూసి దాక్కుంది.. ఏంటని నర్మద కావాలనే అక్కడికి వెళ్తుంది. వెక్కిళ్లు వస్తున్న శ్రీవల్లికి వాటర్ ఇస్తుంది. ఏంటి అక్కడ దాక్కున్నవని నర్మద అడుగుతుంది. మావయ్య హాస్పిటల్ లో ఉన్నాడు కదా.. నీకు తిండేలా పడుతుంది అంటావని భయం అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే ప్రేమ వచ్చి నర్మదని పక్కకి తీసుకొని వెళ్లి చందు బావ కోపంగా అమూల్య దగ్గరికి వెళ్ళాడు కదా.. అమూల్య ఏం జరిగిందో చెప్తుంది.. ధీరజ్ నన్ను వదిలేస్తాడని ప్రేమ ఏడుస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావ్.. ఎందుకు నిన్ను ధీరజ్ వదిలేస్తాడని నర్మద అంటుంది.
దాంతో ప్రేమ జరిగింది మొత్తం చెప్తుంది. ఎంత పని చేసావ్ ప్రేమ అని నర్మద అంటుంది. సరేలే నువ్వు ఇప్పుడు ఈ విషయం ఎక్కడ అనకు.. అయినా అమూల్యని బయటకు తీసుకొని వెళ్ళింది ఎవరని నర్మద అంటుంది. మరొక వైపు చందు కోపంగా అమూల్య దగ్గరికి వెళ్లి తన చెంప చెల్లుమనిపిస్తాడు. నీ వల్ల నాన్న హాస్పిటల్ లో ఉన్నాడని అమూల్య గొంతు పట్టుకుంటాడు చందు. అప్పుడే ధీరజ్ వచ్చి ఆపుతాడు. చందు ని తీసుకొని వెళ్తాడు. మరొక వైపు రామరాజుని చూస్తూ వేదవతి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



