ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2 : షాక్ లో పారిజాతం.. తను వారసురాలు కాదనే నిజం చెప్తుందా!

on Feb 12, 2026


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -591 లో.. శ్రీధర్, కావేరి, స్వప్న ముగ్గురు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. శ్రీధర్ వెళ్లి కార్ లో కూర్చుంటాడు. డ్రైవింగ్ సీట్ లో కూర్చోలేదని స్వప్న అడుగుతుంది. ఇక నుండి కొత్త డ్రైవర్ ని చూసానని కాశీని పిలుస్తాడు శ్రీధర్. తనని చూసి స్వప్న కార్ దిగుతుంది. ఇకనుండి ఇతనే మన డ్రైవర్ అని శ్రీధర్ అంటాడు. అలా అయితే ఈ క్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని స్వప్న కోపంగా లోపలికి వెళ్తుంది. మరోవైపు జ్యోత్స్న సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పి బయటకు వస్తుంది . డాక్టర్ బయటకు రాగానే దీప, కార్తీక్  సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పినందుకు థాంక్స్  అని డాక్టర్ కీ చెప్తారు కానీ ఆపరేషన్ అవ్వదు కదా అని డాక్టర్ అంటుంది. లేదు అవుతుంది. నేను నా బిడ్డని వదులుకోవడానికి సిద్ధం అని దీప అనగానే అది నిర్ణయం మాత్రమే కాదు.. నీ భర్తది కూడా అని డాక్టర్ అంటుంది.

నా భార్య నిర్ణయమే నా నిర్ణయం అని కార్తీక్ అంటాడు.అలా ఎందుకు అని డాక్టర్ కోప్పడుతుంది. ఆ పరిస్థితిలో మీ అమ్మ ఉంటే ఏం చేసేవారు డాక్టర్ మీ అమ్మ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కదా అని దీప అనగానే నిన్ను కన్న సుమిత్ర చాలా అదృష్టవంతురాలు అని డాక్టర్ అంటుంది. మరొకవైపు డాక్టర్ చెప్పింది విని పారిజాతం ఇంకా షాక్ లోనే ఉంటుంది. అంటే ఆ సైదులు గాడు నన్ను మోసం చేసాడు బిడ్డని మార్చలేదు పైగా నా మనవరాలిని నేనే చంపుకున్నానన్న మాట అని పారిజాతం అంటుంది. గ్రానీ అవన్నీ నమ్మకని జ్యోత్స్న అంటుంది. నువ్వు నన్ను అలా పిలవకు.. నువ్వు నా మనవరాలు అనుకుని నీకేదో నేను హెల్ప్ చెయ్యాలని ట్రై చేస్తున్నానని పారిజాతం అంటుంది. 

ఇక నీకేం సమస్య.. సుమిత్ర కన్నబిడ్డ నువ్వే కదా అని పారిజాతం అంటుంది కానీ జ్యోత్స్న మాట అసలు వినిపించుకోదు. మరొకవైపు దీప, కార్తీక్ చాలా బాధపడతారు. ఆ తర్వాత జ్యోత్స్నని పక్కన కూర్చొపెట్టుకుంటుంది సుమిత్ర. ఆ తర్వాత దీపకి స్వీట్ తినిపిస్తుంది సుమిత్ర. మీకేం కాదమ్మా అని దీప అనగానే నా కూతురు నన్ను బ్రతికిస్తుందని జ్యోత్స్న ని ఉద్దేశ్యించి సుమిత్ర చెప్తుంది. పారిజాతం మాత్రం ఇంకా షాక్ లోనే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.