నిఖిల్ కి క్షమాపణలు చెప్పిన గౌతమ్.. ఓటింగ్ డ్యామేజ్ కాకూడదనేనా!
on Dec 4, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇష్యూ మొన్నటి ఎపిసోడ్ లో గౌతమ్, నిఖిల్ ల మధ్య జరిగింది. ఇక ఆ ఇష్యూ లో గౌతమ్ నోరు జారాడు. వాడుకున్నావ్ అంటా.. బరాబర్ అంటా.. మూస్కొని కూర్చో.. అదేమీ తప్పు కాదంటూ నిఖిల్‌పై గౌతమ్ రెచ్చిపోయాడు. ఈ విషయంలో నిఖిల్ కూడా చాలా సీరియస్ అవ్వడంతో ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్‌కి ప్రత్యేకంగా అందరిముందు క్షమాపణలు చెప్పాడు గౌతమ్. అది కూడా తను చేసింది తప్పే అని ఒప్పుకుంటూ నిఖిల్‌కి సారీ చెప్పి హగ్గు ఇచ్చాడు. ఎవరిది తప్పు ఎవరిది కాదు అని కూడా నేను చెప్పను.. నేను వాడుకున్నావ్ అన్నది వేరే రకంగా అనలే.. గేమ్‌లో నువ్వు ఆటాడుతున్నావ్ అని ఎట్ల అన్నావో నేను వాడుతున్నా అని అట్ల అన్నా.. దానికి కూడా నీకు హర్ట్ అనిపించింది కాబట్టి నేను అన్న ఆ మాటని వెనక్కి తీసుకుంటూ ఆ బాధ్యత వహిస్తూ ఐయామ్ రియల్లీ సారీ నిఖిల్.. ఆ పదం వాడినందుకు.. ఎందుకంటే నీకు హర్ట్ అనిపించింది కాబట్టి అలానే మూస్కొని కూర్చో అన్నది కూడా నీకు హర్ట్ అనిపించింది కాబట్టి అది ఆ మూమెంట్‌లో అట్లొచ్చింది కానీ నిన్ను డిస్ రిస్పెక్ట్ చేయాలని అనలేదు.. ఆ రెండు పదాలు వాడినందుకు నిజంగా సారీ.. ఇంకోసారి ఏదీ నీ దగ్గర అలా అనకుండా నోరు జారకుండా జాగ్రత్త పడతానంటూ గౌతమ్ అన్నాడు. నాకు తెలినంతవరకూ నిన్న మాట్లాడింది నీది కానీ ఇంకెవరిదైనా పర్సనల్ విషయం నేను తీయలేదు.. ఒకవేళ నీకు అలా అనిపించి ఉంటే ఐ యామ్ సారీ.. వేరే ఎక్కడా నేను ఇప్పటివరకూ నోరు జారలేదు.. మూస్కొని నొక్కు అన్న మాట వాడినందుకు సారీ.. దానికి నేను నిజంగా సారీ చెబుతున్నా.. అంటూ చెప్పాడు. వెంటనే ఇద్దరూ ఒకరికొకరు హగ్ ఇచ్చుకున్నారు.
గౌతమ్‌కి నిన్న హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో ఏం మాట్లాడాడో తెలియకపోవచ్చు.. కానీ ఆ మాటలు గుర్తు చేసుకొని ఖచ్చితంగా తప్పు అని తెలుసుకొని ఉంటాడు. అందుకే అది ఓటింగ్‌లో డ్యామేజ్ కాకుండా వెంటనే సారీ చెప్పి డిస్కస్ చేశాడు. దీంతో పాటు శనివారం ఎపిసోడ్‌లో ఖచ్చితంగా నాగార్జున ఈ మాటలు చెప్పి మరోసారి తనని కార్నర్ చేస్తారని కూడా గౌతమ్ ఫీల్ అయి ఉండొచ్చు.
Also Read