ఘనంగా నందు-గీతామాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక
on Dec 30, 2024
టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు సింగర్ గీతామాధురి - యాక్టర్, హోస్ట్ నందు. వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. వీళ్ళు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో ఒక పాప పుట్టింది. ఆమె పేరు దాక్షాయణి ప్రకృతి. 2024 ఫిబ్రవరి 10న గీతామాధురికి పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బాబుకి ‘ధృవధీర్ తారక్’ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ బాబుకు ఘనంగా అన్నప్రాసన వేడుక నిర్వహించారు. అటు నందు, ఇటు గీతామాధురి కుటుంబ సభ్యుల మధ్యలో ఘనంగా శాస్త్రబద్ధంగా ఈ అన్న ప్రాసన నిర్వహించారు. ఇక ఆ పిల్లాడి ఎదురుగా డబ్బులు, పుస్తకాలు, పూలు, ఆహరం పెట్టారు. ముందుగా డబ్బును ముట్టుకున్నాడు తారక్. తర్వాత పుస్తకాన్ని, తర్వాత బంగారాన్ని తాకాడు. ఈ తంతు తర్వాత పెద్దవాళ్లంతా ఒక్కొక్కరిగా వచ్చి చిటికెడు చిటికెడు ఆహారాన్ని తినిపించి ఆశీర్వాదాలు అందించారు.
అలా ఫైనల్ హారతిచ్చేసి ఆ అన్నప్రాసన ప్రక్రియను పూర్తి చేశారు. ఇక గీతామాధురి తన సింగింగ్ కన్సర్ట్స్ తో దూసుకుపోతుంటే...నందు మాత్రం అటు ఢీ షోస్ కి హోస్ట్ గా క్రికెట్ కామెంటరీ చేస్తూ ఇటు కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్‌లో నందు సైకోగా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నచించాడు, అలాగే వెల్కమ్ టు మోక్ష ఐలాండ్, వధువు వంటి వెబ్ సిరీస్ లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు వీళ్ళ బాబు అన్న ప్రాసన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read