గౌతమ్ కృష్ణకి షాకిచ్చిన గీతు రాయల్!
on Dec 3, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో పదమూడవ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ లో శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ చివరగా ఉండగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. అయితే శోభాశెట్టిని బయటకు పంపించకుండా, మరోకరిని పంపడమేంటి? ఇది అన్ ఫెయర్ ఎలిమినేషన్ అంటూ చాలా మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక గీతు రాయల్ తో జరిగిన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో గౌతమ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు. అశ్వద్దామ 2.0 అంటే ఏంటని అడుగగా.. చావులేదని నాకు నేను పెట్టుకున్నానని గౌతమ్ అన్నాడు. హౌస్ లోకి 2.0 గా రాకముందు శుభశ్రీతో క్లోజ్ గా ఉన్న నువ్వు లెటర్ సాక్రిఫైజ్ టాస్క్ లో ఎందుకు అలా చేసావని అడుగగా.. డెఫినెట్ గా తనని బయటకు వెళ్ళాక కలుస్తానని అన్నాడు. 2.0 తర్వాత శివాజీ గారి మీద టార్గెట్ గా నామినేషన్ చేస్తూ వచ్చారు కదా అని అడుగగా.. గౌతమ్ కాసేపు తత్తరపోయాడు. నాగార్జున గారు కూడా అదే చెప్పారు కదా అని అనేసరికి ఏం చెప్పాలా అన్నట్టు అయిపోయాడు గౌతమ్.
లాస్ట్ వీక్ నామినేషన్ లో పంచ ఊసిపోకుండా చూసుకో అనే ఒక మాట ప్రశాంత్ అన్నాడు కదా అని అడుగగా.. అవును. దానికి నేను బాగా ట్రిగ్గర్ అయ్యానంటూ గౌతమ్ చెప్పాడు. హౌస్ లో టాప్-7 ఉన్నారు. వీరిలో ముందుకు వెళ్ళేదెవరు? ఆగిపోయేదెవరని అడుగగా.. అర్జున్ ముందుకెళ్తాడు. శివాజీ మైండ్ గేమ్ , స్ట్రాటజీతో ముందుకెళ్తాడు. ప్రతీసారీ శివాజీ గారిని ప్రశాంత్ గుడ్డిగా నమ్మేస్తాడని, అందరిని అమర్ ఆడుక్కోవడమే సరిపోతుందని అది వాడికే మైనస్ అని గౌతమ్ అన్నాడు. శివాజీ గేమ్ గురించి హౌస్ లో చెప్పలేనది, నాగార్జున గారితో చెప్పలేనిది గౌతమ్ మనతో చెప్పాడంటూ గీతు చివర్లో చెప్పేసి ఈ బజ్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం అందరు ఎదురు చూసేలా చేసింది. కాగా ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read