కోడలు గుద్దిన కాపురం... ఎన్టీఆర్ అసోసియేషన్ అభిమాన సంఘానికి నేను పని చేసాను!
on Dec 9, 2025

పాడుతా తీయగా ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించింది. ఈ వారం ఎపిసోడ్ లో గీతాంజలి అనే కంటెస్టెంట్ వచ్చి "నీ ధర్మం మరువద్దు" అంటూ కోడలు దిద్దిన కాపురం మూవీలోని సాంగ్ పాడింది. ఇక దీని మీద గరికపాటి మాట్లాడారు. "ఈ పాట కోడలు దిద్దిన కాపురం సినిమాలోది. అప్పుడు కాబట్టి అలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడైతే కోడలు గుద్దిన కాపురం అనేది వచ్చేది. నేను ఒక చోట అవధానం చేస్తున్నప్పుడు అడిగారు. సమాజం చెడిపోయింది ఏంటి అని..పూర్వకాలంలో ఆత్మీయులు, అనుబంధాలు, ఆడపడుచు రక్తసంబంధాలు ఉండేవి అలాగే కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు వచ్చేవి ఇప్పుడు ఇడియట్, జల్సా, రౌడీ వంటి సినిమాలు వస్తున్నాయి కదా మరి చెడిపోకపోతే ఏమవుతుంది అన్నాను. నేను ఎన్టీఆర్ అసోసియేషన్ అభిమాన సంఘానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేసాను.
చదువుకునే రోజుల్లో తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ టాకీస్ లో ఎన్టీఆర్ సినిమా చూడడానికి టిక్కెట్ల కోసం చేయి విరగ్గొట్టుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని. విద్యార్థులకు ఇలాంటి పాటల్ని అల్పాహారం సేవించే సమయంలో వినిపించాలి. అప్పుడు విద్యార్థి చదువు, ఉద్యోగం కోసం కాదు దేశం కోసం బతుకుతాడు. ఇక ఉచ్చారణ విషయానికి వస్తే మా తరం తప్పు ఎందుకంటే మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాం. పదాల విషయానికి వస్తే తెలుగు, ఇంగ్లీష్ లో వేరువేరుగా ఉంటుంది. 56 అక్షరాల మహత్తరమైన మహాబలేశ్వరం గజల్ లాంటి భాషను ఒట్టి శునకంలాంటి భాషలో చేర్చి నేర్చుకుంటున్నామమ్మా..ఇది మన దౌర్బాగ్యం. 26 అక్షరాల భాషలో పెట్టాం పట్టుకెళ్లి అంటే 30 అక్షరాలు గోవిందా." అంటూ చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



