మా కులం వాళ్ళు ఇక్కడొకరున్నారు.. మనవాళ్ళను మనమే తొక్కేయడం మనకు అలవాటు
on Dec 4, 2025

పాడుతా తీయగా అనేది షో పేరు కానీ ఇందులో కంటెస్టెంట్స్ పాటలు ఎంతలా అలరిస్తున్నాయి గెస్టుల మాటలు, చమత్కారాలు కూడా అంతలా నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే గెస్ట్ గా గరికపాటి వచ్చి తనదైన శైలిలో ఫన్నీ డైలాగ్స్ వేసి ఆడియన్స్ ని నవ్వించారు. ఒక లేడీ కంటెస్టెంట్ వచ్చి "ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట" అనే పాట పాడింది. "భర్తల్ని భార్యలు ప్రేమగా ఏమండోయ్ అని పిలిచేవారు మారి ఇప్పుడు ఏమండోయ్ అనే మాట ఉందా గురువుగారు" అంటూ చంద్రబోస్ గరికపాటికి అడిగారు. "ఇప్పుడూ ఉండి కాకపోతే అటు నుంచి ఇటు అయ్యింది" అంటే భర్తలు భార్యల్ని ఏవండోయ్ అని పిలుస్తున్నారంటూ ఒక చెణుకు విసిరారు. ఇక మరో లేడీ కంటెస్టెంట్ వచ్చి "మా అవని" అంటూ పాడింది. "అవని అనే మాటను నేను సినిమా పాటల్లో ఎక్కడ ఎవరూ ప్రయోగించగా నేను చూడలేదు చాలా అరుదైన మాట." అంటూ చంద్రబోస్ చెప్పారు.
"వేటూరి రాయడం కంటే బాగా చదివారు. అది ఈ పాటలో కనపడుతోంది" అన్నారు గరికపాటి. తర్వాత మరో కంటెస్టెంట్ వచ్చి "ఓ పంకజనాభా" అంటూ ఒక పద్యం పాడింది. "పద్యం అనేది తెలుగు సాహిత్యానికి పరిమితమైన అదొక గొప్ప ప్రక్రియ" అంటూ చంద్రబోస్ చెప్పారు. "ముందుగా పద్యాలు పాడినందుకు నేను నిన్ను అభినందిస్తున్నా. ఎందుకంటే మా కులం వాళ్ళు ఇక్కడొకరు ఉన్నారని అర్ధమయ్యింది. తెలుగు పదాల్లో ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉంటుంది. ఐతే మన అక్షరాల కింద మన ఒత్తులే ఎందుకు ఉంటాయండి అని అడిగారు. మనవాళ్లను మనమే తొక్కేయడం మనకు బాగా అలవాటు అని జవాబిచ్చాను" అని చెప్పేసరికి అందరూ పగలబడి నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



