Jayam Serial : వీరు మాటలకి బెదిరిపోయిన విభూది బాబా.. అతను చెప్పిందే చెప్తాడా!
on Jan 21, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -173 లో... గంగకి రుద్ర పిజ్జా తీసుకుంటాడు. వాళ్ళ వెనకాలే వీరు ఫాలో అవుతాడు. వీళ్ళు ఏంటి ఇలా బేకరీల చుట్టూ తిరుగుతున్నారని వీరు అనుకుంటాడు. అ తర్వాత గంగ, రుద్ర కలిసి లక్ష్మీ చెప్పిన బాబా దగ్గరికి వెళ్తారు. గంగ జరిగింది మొత్తం బాబాకి చెప్తుంది. మీకు నరగోశ ఉంది.. ఇల్లు వాతావరణం చూసి మాట్లాడాలి.. అడ్రెస్ మా వాళ్ళకి ఇచ్చి వెళ్ళండి అని బాబా అంటాడు. అదంతా వీరు వింటాడు. గంగ, రుద్ర వాళ్ళు వెళ్ళిపోయాక బాబా దగ్గరికి వస్తాడు వీరు.
మీరు ఇందాక వచ్చినవాళ్ళ ఇంటికి వెళ్లి.. నేను చెప్పినట్లు చెప్పండి లేదంటే మీరు ఉండరని వార్నింగ్ ఇస్తాడు. దాంతో బాబా భయపడుతాడు. వీరు ఏం మాట్లాడాలో చెప్తాడు. ఆ తర్వాత గంగని రుద్ర బాక్సింగ్ పోటీ జరిగిన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ ప్లేస్ లో ఉండడం అంటే మాములు విషయం కాదు.. అలాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నావ్.. నా వల్ల కానిది నీ ద్వారా నేరవేర్చాలని అనుకున్నా కానీ నువ్వు మిస్ చేసావ్.. ఐ ఆమ్ ఏ లూజర్ అని రుద్ర అంటుంటే గంగ బాధపడుతుంది.
మరొకవైపు శకుంతలతో పెద్దసారు మాట్లాడుతుంటాడు. గంగ వచ్చి మిమ్మల్ని ఇంతవరకు ఏది అడగలేదు.. ప్లీజ్ రుద్ర సర్ తో నన్ను పోటీకి పంపించను అన్న మాట వెనక్కి తీసుకోండి.. నేను పోటీకీ వెళ్తానని గంగ అనగానే అత్తయ్య నిర్ణయానికి అడ్డుచెప్తున్నావా అని ఇషిక, వీరు అంటారు. దాంతో శకుంతల కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత గంగ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏమైందని పెద్దసారుని రుద్ర అడుగగా జరిగింది చెప్తాడు. ఆ తర్వాత గంగ దగ్గరికి ఇషిక, వీరు వెళ్లి నీకు బాక్సింగ్ ఎందుకు? వాటర్ క్యాన్ లు మోయ్యడం సెట్ అవుతుందని మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



