ENGLISH | TELUGU  
Home  » TV News

Jayam Serial : శకుంతల పుట్టినరోజున గంగకి పనులు.. రుద్ర ఏం చేయనున్నాడు!

on Feb 17, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -194 లో..... గంగ బాక్సింగ్ ఆలోచన మానేసి ఇంటిపనులకి అంకితం అయిందని రుద్ర తనపై కోపంగా ఉంటాడు. రుద్రకి గంగ జ్యూస్ తీసుకొని వస్తుంది. నువ్వు ఇంట్లో వాళ్ళ పనులు చేసి అలసిపోయి ఉంటావ్.. నువ్వే తాగు.. నీ లక్ష్యం మానేసి ఇలా పనులు చేస్తే నీకు హ్యాపీగా ఉందేమో కానీ నాకు అలా లేదని రుద్ర కోప్పడతాడు. ఆ తర్వాత శకుంతల దగ్గరికి రుద్ర వస్తాడు. గంగ బాక్సింగ్ కి దూరం ఉండాలని చెప్పిన మీ నిర్ణయం మార్చుకోండి అని శకుంతలతో రుద్ర చెప్తాడు.

శకుంతల అవేం పట్టించుకోకుండా గంగని పిలిచి  రేపు నా పుట్టినరోజు.. నా ఫ్రెండ్స్ వస్తారు.. వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని వంటలు చెయ్యాలి.. ముఖ్యంగా కేక్ నువ్వే రెడీ చెయ్యాలని శకుంతల చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత గంగ దగ్గరికి ఇషిక వచ్చి నా రూమ్ క్లీన్ చెయ్.. ఆ తర్వాత కాఫీ తీసుకొని రా అని గంగకి చెప్తుంది. పాపం గ్లౌస్ లు తొడగాల్సిన చేత్తో ఇంట్లో పనులు చేస్తున్నావని ఇషిక మాట్లాడుతుంది. నాకేం అలా లేదు అని తన మాటకి కౌంటర్ వేస్తుంది గంగ. ఆ తర్వాత ఇంటికి ఇన్‌స్పెక్టర్ వస్తాడు. ఎందుకు ఇలా వచ్చారని పెద్దసారు అడుగుతాడు. గంగ గారు బాను గారి కేసు రీఓపెన్ చెయ్యమని కంప్లైంట్ ఇచ్చిందనగానే అందరు షాక్ అవుతారు.

ఎందుకు ఇలా చేస్తున్నావని శకుంతల అడుగుతుంది. నా భర్త నిర్దోషి అని నిరూపించడానికి అని గంగ అంటుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా తమ అభిప్రాయం చెప్తారు. ప్లీజ్ ఇన్‌స్పెక్టర్ నా భార్య ఏదో తెలియకుండా ఇలా చేసింది.. తను కేసు విత్ డ్రా చేసుకుంటుంది.. మీరు వెళ్ళండి అని రుద్ర చెప్పడంతో ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శకుంతలకి గంగ కాఫీ తీసుకొని వస్తుంది. వదిన అన్నయ్య ఎక్కడ అని సూర్య అడుగుతాడు. టెర్రస్ పైన ఉన్నాడని గంగ చెప్తుంది. సూర్య, వంశీలని గంగ పక్కకి పిలిచి.. మీ అన్నయ్య ఇంట్లో లేడు అకాడమీకి వెళ్ళాడు.. ఈ విషయం అమ్మ గారికి తెలిస్తే కోప్పడుతుంది.. మీరు అలాగే మేనేజ్ చెయ్యమని చెప్తుంది. మరొకవైపు ఒక అమ్మాయిని రుద్ర అకాడమీకి తీసుకొని వెళ్లి పోటీలో ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుందని చెప్తాడు. అదంతా పారు చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.