ఆఫ్టర్ ప్యాకప్ అంటే అదా... నా లైఫ్ లో బావా అని పిలిచింది అతన్నే
on Apr 1, 2025
బుల్లితెర మీద సుధీర్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సుధీర్ యాంకరింగ్ ని అలాగే సుధీర్ కి రష్మీకి ఆన్ స్క్రీన్ బాండింగ్ గురించి అందరికీ తెలుసు. సుధీర్ చాలా డౌన్ టు ఎర్త్ అంటూ నెటిజన్స్ కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే చాలామంది యాంకర్స్ మీద రూమర్స్ వచ్చాయి కానీ సుధీర్ మీద ఒక్క నెగటివ్ రూమర్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే అంత కరెక్ట్ గా ఇచ్చి పని చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫామిలీ స్టార్స్ కి యాంకరింగ్ చేస్తున్నాడు. అలాగే తన మరదళ్ళుగా అష్షు రెడ్డి, స్రవంతి కూడా చేస్తున్నారు. ఐతే సుధీర్ గురించి అష్షు కొన్ని సెన్సేషనల్ విషయాలను చెప్పింది. "నా జీవితం మొత్తంలో నేను ఇప్పటి వరకు బావా అని పిలిచింది ఒక్క సుధీర్ నే. నాకు అంత కనెక్షన్ మా ఫ్యామిలీలో కూడా ఎవరితో లేదు. బావా అని ఫామిలీ స్టార్స్ లో సుధీర్ ని పిలిచేసరికి ఒక్కోసారి పొసెసివ్ నెస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా ఆయన గురించి చెప్పాలంటే ఆయన అసలు ఒక టీవీ పర్సన్ కానే కాదు. అతనొక హీరో పర్సనాలిటీ. డాన్స్ , యాక్టింగ్ ఎన్ని ఎమోషన్ ని క్యాచ్ చేసేస్తారు. ఆయన ఎవరితో ఐనా జోవియల్ గా మాట్లాడే మనిషి. ఇంట్లో మనిషిలా ఉంటారు.
ఆయన మాట్లాడితే చాలు జోక్ ఎం లేకపోయినా ఎవ్వరైనా ఎంటర్టైన్ అవుతారు. ఫామిలీ స్టార్స్ లో ఆఫ్టర్ ప్యాకప్ అనే మాట సుధీర్ అంటూ ఉంటే చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ అదే మాట వేరే యాంకర్స్ అంటూ ఉంటే కోపం వస్తుంది అలాగే ఏంటి ఆఫ్టర్ ప్యాకప్ అంటున్నారు అనాలనిపిస్తుంది. నా జీవితంలో నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు ఇలా సుధీర్ అంత రిజర్వ్ పర్సన్. అంటే వాళ్ళ ఫామిలీ రూట్స్ కూడా అలాగే ఉంటుంది. పెరిగే విధానం కూడా ఒకటి ఉంటుందిగా... స్టేజి మీద పులి... అదే స్టేజి దిగాక ఈ సెట్ లో సుధీర్ గారు ఉన్నారా ? అని అనిపిస్తుంది. వచ్చామా పని చేసుకున్నాము వెళ్ళామా అన్నట్టు ఉంటారు. కుటుంబానికి ఎక్కువ వేల్యూ ఇచ్చే పర్సన్. అలాంటి వ్యక్తులు ఈరోజున చాలా అవసరం. ప్రొఫెషన్ పరంగానే సుధీర్ తెలుసు కానీ ఆ తరువాత పర్సనల్ గా సుధీర్ అంటే తెలీదు. సుధీర్ చాలా తక్కువ మాట్లాడతాడు." అంటూ అష్షు రెడ్డి చెప్పుకొచ్చింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
