Eto Vellipoyindhi Manasu : మనసులో మాట చెప్పేసిన సీతాకాంత్.. నిజం తెలిసి షాకైన శ్రీలత!
on Mar 21, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -357 లో.... సీతా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని శ్రీలత అడుగుతుంది. రామలక్ష్మి, మైథిలి ఒక్కరే అని బయటపెట్టడానికి ఈ పెళ్లి నాటకం ఆడక తప్పదని సీతాకాంత్ మనసులో అనుకొని సరే అంటాడు కానీ రామ్ ఒప్పుకోవాలని సీతాకాంత్ అంటాడు. నాన్న రామ్ నీకు సీతా హ్యాపీగా ఉండడం ఇష్టమే కదా ఈ పెళ్లికి ఒప్పుకోమని శ్రీలత అంటుంది. దానికి రామ్ కొద్దిసేపు అలోచించి సరే అంటాడు. దాంతో శ్రీలత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వీడు ఒప్పుకున్నాడు కాబట్టి బెటర్ అయింది లేదంటే మన పరిస్థితి ఏంటని సందీప్ తో శ్రీలత అంటాడు.
ఆ తర్వాత రమ్యని సీతాకాంత్ పక్కకి పిలిచి.. నీపై నాకు ఏ ఉద్దేశ్యం లేదు.. ఇది కేవలం మైథిలీ రూపంలో ఉన్న రామలక్ష్మిని బయటకి తేవడం కోసమని సీతాకాంత్ చెప్పగానే.. రమ్య షాక్ అవుతుంది. నా భార్యకి తప్ప ఎవరికి చోటు లేదు ఒకవేళ తను రామలక్ష్మి కాదని తెలిసినా తన జ్ఞాపకాలతో బ్రతికేస్తా తప్ప.. పెళ్లి చేసుకోను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చెయ్యమని రమ్యని సీతాకాంత్ రిక్వెస్ట్ చేస్తాడు. రమ్య సరే అంటుంది. మరొకవైపు రామలక్ష్మి లండన్ వెళ్లాడనికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక మన ప్రయత్నం ఎవరు ఆపలేరని ఫణీంద్ర అంటాడు. అప్పుడే సీతాకాంత్, రామ్ ఇద్దరు ఎంట్రీ ఇస్తారు.
ఎందుకు వచ్చారని రామలక్ష్మి కోప్పడుతుంది. ఎల్లుండి నా ఎంగేజ్ మెంట్ రండి అని సీతాకాంత్ అనగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. నేను లండన్ వెళ్తున్నాను రానని చెప్తుంది. రామలక్ష్మిని రమ్మని రామ్ రిక్వెస్ట్ చేస్తాడు. మీరు నాతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా.. మీరు రావాలని రామ్ అంటుంటే సిరిని గుర్తు చేసుకొని రామలక్ష్మి వస్తానఙటుంది. ఆ తర్వాత పెళ్లికి సీతా ఒప్పుకున్నాడని శ్రీవల్లి, శ్రీలత, సందీప్ ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. రమ్య వెళ్లి డబ్బు వస్తుందని ఆశతో మీరు చెప్పినట్టు చేసాను కానీ సీతా సర్ మనసులో రామలక్ష్మికి తప్ప ఎవరికి చోటు లేదంటు సీతాకాంత్ మాట్లాడింది. మొత్తం వాళ్లకు రమ్య చెప్తుంది. వాళ్ళు టెన్షన్ పడుతారు. ఏది ఏమైనా మనకి కావలసింది డబ్బు కదా.. మనం చెయ్యాలిసింది. మనం చేద్దామని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
