Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి చేసిన మోసాన్ని తల్చుకొని ఏడ్చేసిన కొడుకు.. భార్యతో కొత్త ప్రయాణం!
on Dec 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -292 లో..... శ్రీలత చేసిన మోసాన్ని సీతాకాంత్ గుర్తుచేసుకుంటూ బాధపడతాడు. అంత నమ్మిన తల్లి అతన్ని మోసం చేసిందన్న జాలి చూపించడం భరించలేకపోతున్నాను రామలక్ష్మి అని సీతాకాంత్ బాధపడుతాడు. మీరేం బాధ పడకండి అని రామలక్ష్మి ధైర్యం చెప్తుంది. తన ఒళ్ళో తల పెట్టి పడుకుంటాడు. ఇక నీ చెయ్యి ఎప్పుడు వదలను రామలక్ష్మి అని సీతాకాంత్ అంటాడు.
మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంట్లో కన్పించక పోయేసరికి సుజాత మాణిక్యం దగ్గరికి వచ్చి నిద్ర లేపుతుంది. వాళ్లు ఇంట్లో ఎక్కడ లేరనగానే అల్లుడు గారు తన తల్లి చేసిన మోసాన్నీ తట్టుకోలేక మన ముందు ఉండలేక వెళ్లిపోయి ఉంటాడు. అయిన తన వెంట రామలక్ష్మి ఉంది కదా ఎందుకు భయమని మాణిక్యం రిలాక్స్ గా ఉంటాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు నడుస్తూ వెళ్తారు. మన జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తున్నాం. పాత విషయాలు పట్టించుకోకుండా మనసులో ఉంచుకోకుండా హ్యాపీగా ఉండాలని రామలక్ష్మి అంటుంది. అటుగా వాళ్లు వెళ్తుంటే.. దారిలో ఒకతను టీ షర్ట్స్ అమ్ముతుంటాడు. తనకి గిరాకీ అవ్వదు.. నేను అమ్మేలా చేస్తాను అనడంతో అలా చేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఇస్తానని అతను అంటాడు. దాంతో సీతాకాంత్ తన బిజినెస్ మైండ్ తో అవి అమ్ముడు పోయేలా ఆఫర్ పెడతాడు. దాంతో పాటు రామలక్ష్మి కస్టమర్స్ ని పిలుస్తూ ఉంటుంది. దాంతో టీ షర్ట్స్ అమ్ముడుపోతాయి.
అతను ఫిఫ్టీ పర్సెంట్ లాభాన్ని సీతాకాంత్, రామలక్ష్మిలకి ఇస్తాడు. ప్రస్తుతం మనం బ్రతకడానికి డబ్బు వచ్చిందని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు అప్పుల వాళ్లు వచ్చి సందీప్ ని ఏమైనా అంటారేమో అని సందీప్ భయపడుతాడు. ఆ రామలక్ష్మి ని ఎదరుకునే కరెక్ట్ పర్సన్ ని తీసుకొని రావాలని ధన, శ్రీలత వాళ్ళు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే భద్రం ఒక దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తను అందరిని మోసం చేసి ల్యాండ్ అమ్ముతాడు. వాళ్లు తిరగబడితే అతన్ని చంపుతానంటూ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read