Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిలు ఒక నాటకం.. సంబరపడ్డ అత్త, మామ!
on Dec 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. (Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -289 లో..... శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది రామలక్ష్మి. నువ్వు ఎప్పటికైన మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని అంటుంది. మీరే నా దగ్గరికి వస్తారని శ్రీలత అంటుంది . ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి నేను మర్చిపోయింది బ్యాగ్ లోనే ఉందని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయలుదేర్తారు. చీకటి అవుతుంది నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు.. నేను రెండు రోజుల్లో వస్తానని సీతాకాంత్ అంటాడు. మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే.. నేను అక్కడికి వెళ్లి హ్యాపీగా ఉండాలా నేను వెళ్ళను.. మీరు రండి లేదంటే నేను వెళ్ళనంటుంది.
నా వల్ల రామలక్ష్మి ఇబ్బంది పడడం ఎందుకని.. పదా వస్తానని సీతాకాంత్ అనడంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు సిరి దగ్గరికి ధన వచ్చి.. నేను ఏది కావాలని చెయ్యలేదు.. పరిస్థితి అలా చేయించింది. నేను వాళ్లు చెప్పినట్లు వినకపోతే మనల్ని కూడా అలాగే చేసేవాళ్ళు.. అందుకే వినాల్సి వచ్చిందని ధన అనగానే.. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళదామని సిరి అంటుంది. మీ అన్నయ్య నువ్వు కష్టపడితే చూడలేడని సిరిని కూల్ చేస్తాడు ధన. ఆస్తులన్నీ నీ పేరున ఉన్నాయ్.. కాబట్టి నీతో ఇలా ఉంటున్నాను. ఎలాగైనా ఆస్తులు నా పేరున రాయించుకోవాలని ధన కన్నింగ్ గా ఆలోచిస్తాడు.
మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మి లు ఇద్దరు మాణిక్యం ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసి మాణిక్యం సుజాతలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి అల్లుడు గారు అలా ఉన్నారని మాణిక్యం రామలక్ష్మిని అడుగుతాడు. ఏం లేదంటూ రామలక్ష్మి జరిగింది చెప్పదు. ఆ తర్వాత అల్లుడు గారు ఏం తినలేదని సుజాత అనగానే.. పింకీ, రామలక్ష్మిలు ఒక నాటకం ఆడి ఎలాగైనా సీతాకాంత్ భోజనం చేసేలా చేస్తారు. సీతాకాంత్ రామలక్ష్మిలని చూసి మాణిక్యం, సుజాతలు మురిసిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read