Eto Vellipoyindhi Manasu : సవతి కొడుకు మీద ప్రేమ ఉంటుందా.. ఆస్తి కోసమే ఇదంతా డ్రామా!
on Dec 25, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -288 లో....మా ఆయన మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటే మీరు ఇంత మోసం చేస్తారా అంటూ రామలక్ష్మి అందరిని తిడుతుంది. సందీప్ నా కన్నకొడుకు.. వీడు నా సవతి కొడుకు.. నా కన్నకొడుకు పైనే ప్రేమ చూపిస్తాను. అసలు సీతా అంటేనే నాకు పడదని శ్రీలత అనగానే.. అమ్మ నువ్వేనా ఇలా అంటుంది.. సీతా అన్నయ్యకి ఏ బాధైనా తల్లడిల్లిపోయేదానివి.. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని సిరి అంటుంది.
ఆ ప్రేమ మొత్తం ఆస్తుల కోసం.. అవే ఇప్పుడు నా చేతికి వచ్చాక. ఇక నటించాల్సిన అవసరం లేదని శ్రీలత అంటుంది. శ్రీలతతో సీతాకాంత్ ఇంకా ప్రేమగా మాట్లాడుతుంటే.. నన్ను అమ్మ అని పిలిచిన ప్రతీసారి తేళ్లు, జెర్రీలు పాకినట్లు ఉంటుందని శ్రీలత అనగానే సీతాకాంత్ బాధపడతాడు. అన్నయ్య లేకుంటే మన పరిస్థితి ఎలా ఉండేది అమ్మ ఇలా మాట్లాడుతున్నావని సిరి అంటుంది. ఒకవైపు శ్రీవల్లి.. మరొకవైపు సందీప్ కలిసి సీతాకాంత్ ని తమ మాటలతో బాధపెడతారు. ఇంట్లో నుండి వెళ్ళిపోతారా.. బయటకు గెంటేయ్యమంటారా అని శ్రీవల్లి అంటుంది. ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి రామలక్ష్మి, సీతాకాంత్ లు నిర్ణయం తీసుకొని బయటకు వస్తుంటే.. నేను మీతో వస్తాను అన్నయ్య అని సిరి అంటుంది. వద్దని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత డబ్బు కోసమే నన్ను ప్రేమించావా అంటూ ధన పైన సిరి కోప్పడుతుంది. ఆ తర్వాత నేను ఒకటి మర్చిపోయానంటూ రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావ్ డబ్బు కావాలా అంటూ తనని అవమానిస్తారు. జల్సాలకి అలవాటు పడ్డ వీడి చేతిలో ఆస్తులు పెట్టావ్.. మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే టైమ్ వస్తుందని రామలక్ష్మి అంటుంది. మీరే నా అవసరం కోసం వస్తారని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read