Eto Vellipoyindhi Manasu : లండన్ కి వెళ్తాననుకున్న రామలక్ష్మి.. రామ్ ఒప్పుకుంటాడా!
on Mar 20, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -356 లో..... శ్రీలత దగ్గర కి రామ్ ని రమ్య తీసుకొని వస్తుంది. నీకు థాంక్స్ అండ్ సారీ నాన్న.. సీతా పెళ్లి చేసుకుంటే వాడు హ్యాపీగా ఉంటాడు. వాడు హ్యాపీగా ఉండడం నీకు ఇష్టమే కదా అని శ్రీలత రామ్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది కానీ రామ్ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి ఫోటో ఉన్న గదిలోకి సీతాకాంత్ వెళ్తాడు.తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతాడు. అసలు ఆ గదిలో ఏముందంటూ రామ్ డోర్ దగ్గరికి వచ్చి చూస్తుంటే అప్పుడే శ్రీవల్లి వచ్చి రామ్ ని పిలుస్తుంది. దాంతో రామ్ వెనక్కి వెళ్తాడు.
ఆ తర్వాత శ్రీలత దగ్గరికి రామ్ వచ్చి సీతా ఎందుకు ఆ గదిలోకి వెళ్తాడు. అక్కడ ఏముందని రామ్ అడుగగా.. ఏం లేదని ఏదో ఒకటి చెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి వెళ్లి అదే అడుగుతాడు. అది సీక్రెట్ ఆ విషయలు చెప్పకూడదని శ్రీవల్లి అనగానే రామ్ మళ్ళీ రమ్య దగ్గర కి వెళ్లి అడుగుతాడు. దాని గురించి సీతా గారికి మాత్రమే తెలుసు. అందుకే ఆయననే అడుగమని రమ్య చెప్తుంది. రామ్ ఆలోచిస్తుంటే సీతాకాంత్ తన దగ్గరికి వెళ్తాడు. ఆ గదిలో ఏముంది అని రామ్ అడుగగా రామలక్ష్మి ఉంటుంది. తనే గనుక ఉంటే నిన్ను బాగా చూసుకునేదని సీతాకాంత్ అంటాడు. మరి నాకు తనని చూపించమని రామ్ అనగానే.. చూపిస్తాను త్వరలోనే అని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు ఎంత త్వరగా లండన్ వెళ్తే అంత మంచిదని రామలక్ష్మితో ఫణీంద్ర మాట్లాడతాడు. ఇక అక్కడికి వెళ్లి హ్యాపీగా ఉండొచ్చని ఫణీంద్ర అంటాడు.
ఆ తర్వాత సీతాకాంత్, రమ్య లకి పెళ్లి చెయ్యడానికి ముహూర్తం చూడడానికి శ్రీలత పంతులు గారిని పిలిపిస్తుంది. మైథిలి, రామలక్ష్మి ఒకటేనని తెలుసుకునేందుకు నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని సీతాకాంత్ అనుకుంటాడు. ఈ పెళ్లి ఇష్టమే కదా అని శ్రీలత అడుగుతుంది. ఇష్టమే కానీ రామ్ కూడా ఒప్పుకోవాలని సీతాకాంత్ అంటాడు. రామ్ సీతా హ్యాపీగా ఉండడం నీకు ఇష్టమే కదా నువ్వు చెప్పు అని రామ్ ని శ్రీలత అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
