Eto Vellipoyindhi Manasu : ఆస్తుల కోసం కొడుకుని లేపేయ్యాలని చూస్తున్న సవతి తల్లి!
on Dec 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -284 లో... శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వచ్చి మీరు నిజంగానే మారిపోయారా అని అడుగుతుంది. రామలక్ష్మి అడిగిన వాటిల్లో సందీప్ ఇష్టమని శ్రీలత చెప్పగానే.. అంటే మీకు సీతా సర్ కన్నా సందీప్ ఇష్టం అన్నమాట అని రామలక్ష్మి అనగానే.. సీతా ఇష్టమే కానీ సందీప్ ని నవమాసాలు మోసి కన్నాను కదా అని శ్రీలత కవర్ చేస్తుంది. మీరు మారిపోతే మంచిదే కానీ మారకుండా సీతా సర్ నీ ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం మళ్ళీ నా సంగతి తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి.
ఆ తర్వాత నందిని వెళ్ళిపోయినందుకు సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. అప్పుడే శ్రీలత కోపంగా వచ్చి నేను ఎంత నటించిన కూడా ఎలా రామలక్ష్మికి దొరికిపోతున్నానని అంటుంది. మీరు నటిస్తున్న విషయం తెలిసిందా అని శ్రీవల్లి అనగానే.. లేదు డౌట్ వచ్చింది కానీ తనకి డౌట్ వస్తే తెలుసుకునే వరకు వదిలి పెట్టదు. ఇక ఆలస్యం చెయ్యొద్దు సీతా, రామలక్ష్మిలని లేపెయ్యాలి. రేపు బయటకు వెళ్తున్నాం కదా మనం ఇంటికి రావాలి.. వాళ్ళు రాకూడదని శ్రీలత అంటుంది.
మరుసటి రోజు శ్రీలత పుట్టిన రోజు కాబట్టి సీతాకాంత్ సర్ ప్రైజ్ అంటూ ఒక చారిటబుల్ ట్రస్ట్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఆ ట్రస్ట్ కి శ్రీలత పేరు పెడతాడు. దాంతో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా అత్తయ్య ఆయనకు మీరంటే ఏంత ఇష్టమో.. ఎప్పుడు తనని బాధపెట్టాలనుకోకండి అని రామలక్ష్మి అనగానే.. అలా ఎందుకు అనుకుంటానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఇలా అన్ని డబ్బులు ఖర్చు చేస్తే మనకి మిగిలేది ఏంటని శ్రీలతతో సందీప్ అంటాడు. ఇక వీళ్ళని చంపెయ్యాలని శ్రీలత అనగానే అప్పుడే ధన వచ్చి ఎవరిని చంపెయ్యాలంటున్నారని అంటాడు. దాంతో సందీప్ కవర్ చేస్తాడు. ఆస్తులు కావాలంటే నేను చెప్పినట్టు విను అని శ్రీలత అనగానే.. సరేనని ధన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read