ఇమ్మూకి సాయి పల్లవి లాంటి అమ్మాయి కావాలట...
on Mar 20, 2025
బుల్లితెర మీద ఉగాది సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. మా ఇంటి పండగ పేరుతో రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బుల్లితెర నటీనటులు వాళ్ళ కుటుంబాల వాళ్ళు వచ్చారు. అందులో ఇమ్మానుయేల్ తన ఫామిలీ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక వాళ్ళ అమ్మ ఐతే ఇమ్ము పెళ్లి విషయం గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇప్పటివరకు వర్ష, ఇమ్ము ఫ్రెండ్స్ అని తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం అని అలాగే పెళ్లి చేసుకునే వరకు వెళ్తుంది వీళ్ళ బంధం అన్నట్టుగా ఉండేవాళ్ళు. అలాగే కోడలు వస్తోంది అని మీ అమ్మకు చెప్పు ఇమ్ము అంటూ వర్ష గతంలో వేసిన డైలాగ్స్..అల్లుడొస్తున్నదంటూ మీ ఇంట్లో చెప్పు వర్షా అంటూ ఇమ్ము వేసిన డైలాగ్స్ అన్నీ కూడా మనం బుల్లితెర మీద చూసాం. మరి ఏమయ్యిందో ఏమో కానీ ఇప్పుడు విడిపోతున్నట్టుగా కొన్ని సంకేతాలు ఇచ్చారు.
అలాగే ఈ మధ్య ఇమ్ము కూడా స్టార్ మా షోస్ లో కనిపిస్తున్నాడు. ఇక ఉగాదికి ప్రసారం కాబోయే మా ఇంటి పండగలో కూడా కనిపించాడు. అందులో ఇమ్ము పెళ్లి విషయం గురించి వాళ్ళ అమ్మ చెప్పింది. హరి ఐతే "ఆంటీ ఇమ్ముకి పెళ్ళెప్పుడు చేస్తున్నారు" అని అడిగాడు. "మంచి అమ్మాయి దొరకాలిగా" అంటూ ఇమ్ము వాళ్ళ అమ్మా చెప్పింది. దానికి హోస్ట్ విష్ణు ప్రియా "ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి" అని అడిగింది. "సాయి పల్లవి అంత క్వాలిటీ ఉండాలి" అని మొహమాటం లేకుండా చెప్పేసింది ఇమ్ము వాళ్ళ అమ్మ. ఆ మాటకు ఇమ్మునే షాకైపోయాడు. ఇక ప్రోమో ఫైనల్ లో షోకి స్పెషల్ అట్రాక్షన్ గా రాములమ్మ విజయశాంతి వచ్చింది. ఆమెతో పాటు కళ్యాణ్ రామ్ కూడా వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి అర్జున్ S / O వైజయంతి అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
