.webp)
డ్రామా జూనియర్స్ లో చిన్న పిల్లల కామెడీ కంటే జడ్జెస్ అండ్ హోస్ట్ కామెడీ వేరే లెవెల్ లో ఉంటోంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. డ్రామా జూనియర్స్ సెట్ ని తొడలు కొట్టి అల్లాడించారు....జబ్బలు చరిచి ఔరా అనిపించారు. కొంతమంది చిన్నపిల్లలు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది మూవీ సీన్స్ ని స్పూఫ్ గా చేశారు. ఆదిగా చేసిన కుర్రాడికి వాళ్ళ అమ్మాయి వచ్చి "నాయన నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్న " అనేసరికి "సీమలో ప్రేమలుండవ్ పగలే " అన్నాడు. "పగలే కాదు రాత్రులు కూడా ఉంటాయి " అంటూ ఆ అమ్మాయి కౌంటర్ ఇచ్చింది. "ఆటో పంచులు వేస్తె ఆటంబాంబ్ నోట్లో కుక్కి సంపుటా " అన్నాడు.
"ఇంతకు యాడమ్మా " అని అగిడాడు. వెంటనే సుధీర్ వచ్చాడు. "వాహ్ ఎం తేజస్సు బిడ్డ.. సింగరేణి బొగ్గు గురించి వినడమే కానీ మొట్టమొదటి సారిగా సూత్తుండాను . ఇదొక్కసారి తొడ గొట్టు " అన్నాడు. సుధీర్ నెమ్మదిగా తొడ గొట్టాడు. వెంటనే అమ్మా సివంగి ఒక్కసారి తొడ గొట్టు అనగానే ఆ పిల్ల తొడ గొట్టింది వెనక కార్ లన్నీ గాల్లోకి లేచాయి. ఇంతలో శ్రీకాంత్ "ఏంటి సుధీర్ కొట్టు" అన్నారు. "నాకు చెప్పడం కాదు మీరు కొట్టండి " అన్నాడు. శ్రీకాంత్ తొడ గొట్టారు. అంతే వెనక నుంచి పట్టాల మీద వెళ్లే ట్రైన్ కాస్తా గాల్లోకి లేచి ముక్కలైపోయింది.
రోజా గారు మీరు కొట్టండి అన్నాడు సుధీర్. "జబ్బ చరిస్తే చాలు" అనేసరికి వెనక రోడ్ రొల్లర్ గాల్లోకి లేచి విరిగిపోయింది. "రోడ్ రోలర్ ని లేపారా మీరు " అన్నాడు సుధీర్ నవ్వుతూ. "అనిల్ గారు మీరొక్కరే మిగిలారు " అనేసరికి అనిల్ రావిపూడి లేచి గట్టిగా తొడగొట్టారు. అంతే వెనక సముద్రంలో వెళ్లే పడవ తగలబడి ముక్కలైపోయింది. వీల్లవన్నా నమ్మశక్యంగా ఉన్నాయి రోడ్డు మీద వెళ్లే వాటిని లేపారు. ఆయన షిప్ ని లేపాడు" అంటూ సుధీర్ కౌంటర్ వేసాడు. గ్రాఫిక్స్ లోనే ఇవన్నీ అన్నాడు సుధీర్.
ఇక వెనక బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో "ఒక్కసారి తొడ కొట్టు చిన్న" అన్న మాట వినిపించేసరికి సుధీర్ గట్టిగా తొడ కొట్టాడు. ఇక రోజా ఊరుకోకుండా "సుధీర్ ఛీఛీ అన్నారు " "అన్ని సార్లు ఛీఛీ అనొద్దు నాకే అనిపిస్తోంది ఛీఛీ అని" అన్నాడు సుధీర్.




.webp)

