"సుప్రీమ్ హోస్ట్" సుధీర్...డ్రామా జూనియర్స్ బ్లాక్ బస్టర్ అంటున్న నెటిజన్స్
on Apr 8, 2025
సుడిగాలి సుధీర్ దశ తిరిగిపోయినట్టు కనిపిస్తోంది. మొదట ఢీ డాన్స్ షోకి హోస్ట్ గా, జబర్దస్త్ లో కమెడియన్ గా, టీం లీడర్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకర్ గా చేసాడు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ మూవీస్ కూడా చేసాడు. ఆ తర్వాత మళ్ళీ బుల్లితెర మీదకు వచ్చి ఫామిలీ స్టార్స్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. అలాంటి సుధీర్ ఇప్పుడు లేటెస్ట్ షోకి యాంకర్ గా రాబోతున్నాడు. అదే డ్రామా జూనియర్ సీజన్ 8 కి హోస్ట్ గా చేయబోతున్నాడు. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద సుప్రీమ్ హీరో అంటూ చిరంజీవిని అనేవారు...ఇప్పుడు బుల్లితెర మీద సుప్రీమ్ హోస్ట్ అంటూ సుధీర్ పేరు వేస్తున్నారు. ఈ షో మెగా లంచ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
ఇక ఈ షోకి రోజా, అనిల్ రావిపూడి, ఆమని, జగపతి ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇచ్చారు. అనిల్ రావిపూడి రావడంతోనే "హిస్టరీలో డ్రామా జూనియర్స్ వచ్చిన ప్రతీసారీ విక్టరీనే" అంటూ డైలాగ్ వేశారు. తర్వాత రోజా వచ్చి "నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం" అని చెప్పింది. సుధీర్ వచ్చి "అందుకే నేనంటే మీకు చాలా ఇష్టం" అంటూ తనను తాను చిన్నపిల్లాడిలా చెప్పుకున్నాడు. వీళ్ళ తర్వాత జగపతి బాబు వచ్చి "మా అమ్మ ఎప్పుడూ చెప్తా ఉండేది మీరంతా కూడా చేస్తున్నారు 15 - 20 టేకులు వాళ్ళు చేస్తున్నారు సింగల్ టేకులో" అంటూ పిల్లల గురించి చెప్పుకొచ్చారు. ఫైనల్ గా సుధీర్ వచ్చి "ఇక ముందుండేది వైల్డ్ ఫైర్" అంటూ షో గురించి గట్టిగానే హైప్ క్రియేట్ చేసాడు. ఈ షో ఏప్రిల్ 12 నుంచి ప్రతీ శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది. నెటిజన్స్ ఐతే "సుధీర్ షో అంటే బ్లాక్ బస్టర్ ..." అంటూ కామెంట్ చేస్తున్నారు. సుధీర్ ఉంటే చాలు ఆ షోకి రేటింగ్ మాములుగా ఉండదు అంటూ మేకర్స్ కూడా అనుకుంటున్నారు. మరి ఈ షో ఎలా ఉండబోతోందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
